Samantha Emotional: విభిన్నమైన పాత్రలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ ని సంపాదించుకొని దశాబ్దకాలం నుండి ఇండస్ట్రీ ని ఏలుతున్న హీరోయిన్ సమంత..సాధారణంగా ప్రతీ ఏడాది వచ్చే కొత్త హీరోయిన్స్ వల్ల పాత హీరోయిన్స్ కి క్రేజ్ తగ్గుతుంది అని అందరూ అంటుంటారు..కానీ సమంత విషయం లో అది జరగలేదు..ఎంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వస్తున్నప్పటికీ తన స్థానం తనదే..ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడానికి కూడా దర్శక నిర్మాతలు సంకోచించరు.

రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెల్సిందే..ఈ సినిమా తర్వాత ఆమె ‘శాకుంతలం’ అనే భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది..గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదలైంది..ఈ ట్రైలర్ కోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేసారు.

ఈ ఈవెంట్ లో సమంత ఎమోషనల్ గా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అంతే కాకుండా చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకు రావడం తో సోషల్ మీడియా లో ఉన్న ప్రముఖ పేజెస్ ‘సమంత ఏమిటి ఇలా అయిపోయింది..అందం మొత్తం తగ్గిపోయింది..విడాకులు తీసుకొని నిలదొక్కుకుంటున్న సమయం లో మయోసిటిస్ వ్యాధి రావడం చాలా బాధాకరం..సమంత పూర్తి స్థాయి లో కోలుకొని మునుపటిలాగ అందం మరియు అభినయం తో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఫేస్ బుక్ లో ఒక ప్రముఖ పేజ్ వేసిన పోస్ట్ కి సమంత స్పందిస్తూ ‘నాకు ఎదురైనని సవాళ్లు ఎవరికీ పగవాడికి కూడా రాకూడదని ప్రార్థిస్తున్నాను..నాలాగా నెలల తరబడి హాస్పిటల్ బెడ్ కి పరిమితమై ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదు..దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ సమంత రిప్లై ఇచ్చింది.