Homeజాతీయ వార్తలుRSS Target BRS: ‘బీఎల్‌’ను గోకాడు.. కేసీఆర్‌ టార్గెట్‌ అయ్యాడు.. రంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌!

RSS Target BRS: ‘బీఎల్‌’ను గోకాడు.. కేసీఆర్‌ టార్గెట్‌ అయ్యాడు.. రంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌!

RSS Target BRS: ‘ఈడు బక్కపల్చటోడో.. గీంతోని ఏమైతది.. అనుకున్నరు అంతా.. కానీ తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన్నా లేదా.. తెలంగాణ వస్తదని ఎవరైనా ఊహించిండ్రా.. కల నిజం చేసిన’ తెలంగాణ ఉద్యమం గురించి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడే సందర్భంలో కేసీఆర్‌ చెప్పే మాటలవి.. ఇక ఏడాదిన్నరగా కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా కయ్యానికి కాలుదువ్వుతున్న కేసీఆర్‌.. తాను బక్కటోన్నని తెలిసినా.. తన రాజకీయ చతురతపై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంపై పోరాటానికి పిలుపునిచ్చిన అనేకమంది వెనక్కి తగ్గారు. కేసీఆర్‌ మాత్రం.. చివరి వరకు కొట్లాడాలనే నిర్ణయించుకున్నారు. ‘మోదీ నువ్వు గోకినా గోకకున్నా నేను గోకుతా’ అని సవాల్‌ చేశారు. అన్నట్లుగానే తరచూ కేంద్రాన్ని గిల్లి లొల్లి పెట్టుకుంటున్నారు. జాతీయస్థాయిలో నిత్యం చర్చల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయకార్యదర్శి బీఎల్‌. సంతోష్‌ను ఇటీవల గోకారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోకి ఆయనను లాగే ప్రయత్నం చేశారు. కానీ, కోర్టు ద్వారా సంతోష్‌ కేసీఆర్‌ ప్రయత్నాలకు బ్రేక్‌ వేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోల ఎప్పుడు కనిపించని బీఎల్‌. సంతోష్‌ పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌ వాది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య సమన్వయం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఆయనను టచ్‌ చేసిన కేసీఆర్‌ కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది.

RSS Target BRS
BL Santosh KCR

ఆర్‌ఎస్‌ఎస్‌ టార్గెట్‌ చేసిందా?
బీఎల్‌ సంతోష్‌ను కేసీఆర్‌ సర్కార్‌ టార్గెట్‌ చేసినందుకు. ఆర్‌ఎస్‌ఎస్‌ తాము బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు అన్ని అనుబంధ సంఘాలు కీలకంగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్‌లోనే ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు వివిధ హిందూ సంఘాలు సమావేశమై ‘రాజకీయంగా వెళ్లకుండా.. అధికారం ఉందని బీఎల్‌ సంతోష్‌ను జైలుకు పంపాలనుకున్నారని.. కేసీఆర్‌ను ఇక సానుకూలంగా చూసే పరిస్థితి ఉండకూడదు’ అని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

సంతోష్‌ ముందే హెచ్చరించారు..
తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పర్యవసానాలు తప్పక అనుభవించాల్సిందేనని ఫామ్‌హౌస్‌ కేసు విషయంపై తెలంగాణ సర్కార్‌ ను బీఎల్‌.సంతోష్‌ ఇటీవలే హెచ్చరించారు. ఆ హెచ్చరికల పర్యవసానాలు ఎలా ఉంటాయో కానీ బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడానికి బీజేపీతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తమ శక్తియుక్తులు మొత్తం వెచ్చించాలని నిర్ణయంచినట్లుగా ప్రచారం సాగుతోంది. బీఎల్‌.సంతోష్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద మనిషి. ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. ఆయన ఎలాంటి పదవులు తీసుకోరు. కేవలం పార్టీ కోసం పని చేస్తారు. అలాంటి తమ నేతను బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసిందని.. తాము ఎలా కామ్‌గా ఉండగలమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

బీజేపీ విజయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌
బీజేపీ కొత్తగా ఏ రాష్ట్రంలో విజయం సాధించినా.. ఆరెస్సెస్‌ పాత్రను ఎవరూ కాదనలేరు. పైకి కనిపించకుండా.. ఇంటింటి ప్రచారం చేస్తూ.. బీజేపీకి ఓటర్లుగా మార్చడంలో వీరి పాత్ర కీలకం. త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందంటే కారణం ఆర్‌ఎస్‌ఎస్‌. ఏళ్ల తరబడి ప్రణాళికాబద్ధంగా పని చేయడమేనని రాజకీయవర్గాలు నమ్ముతాయి. ఈసారి తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఓ నివేదిక రెడీ చేసుకుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించారు.

RSS Target BRS
KCR

తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి దిగితే.. వచ్చే ఎన్నికల్లోల బీజేపీ విజయం మరింత సులువు అవుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్‌ బీజేపీతోనే కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ తలపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కొవడం కేసీఆర్‌కు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మరి భవిష్యత్‌ రాజకీయాలో ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular