spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli On NTR: ఎన్టీఆర్ పై రాజమౌళి కామెంట్స్.. అమెరికాలో షాకైన హాలీవుడ్ మీడియా

SS Rajamouli On NTR: ఎన్టీఆర్ పై రాజమౌళి కామెంట్స్.. అమెరికాలో షాకైన హాలీవుడ్ మీడియా

SS Rajamouli On NTR: ఆర్ ఆర్ ఆర్ టీం ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఆర్ ఆర్ ఆర్ నామినేటైన నేపథ్యంలో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ అక్కడకు వెళ్లారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ మీడియా ప్రతినిధులతో ఎన్టీఆర్, రాజమౌళి మాట్లాడారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కేటీ వాల్ష్ ఎన్టీఆర్, రాజమౌళితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగే పలు ప్రశ్నలకు ఎన్టీఆర్, రాజమౌళి సమాధానాలు చెప్పారు.

SS Rajamouli On NTR
SS Rajamouli On NTR

నాటు నాటు సాంగ్ షూటింగ్ సమయంలో రాజమౌళి టార్చర్ చూపించారని ఎన్టీఆర్ తెలిపారు. నాటు నాటు సాంగ్ షూట్ 12 రోజులు షూట్ చేశాము. ఒక పట్టాన షాట్ ఓకే చేసేవారు కాదు. 65 రాత్రులు ఆ పాట కోసం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇద్దరి డాన్స్ మూమెంట్స్ ఖచ్చితంగా సింక్ కావాలని రాజమౌళి నరకం చూపించారని వెల్లడించారు. ఇక సెట్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ అల్లరి గురించి రాజమౌళి ఫన్నీగా చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో వీరు చిన్న పిల్లల మాదిరి అల్లరి చేసేవాళ్ళు. వీరి అల్లరి కారణంగా షూట్ క్యాన్సిల్ అయిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు.

అందుకే మీకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యమైందా… అని కేటీ వాల్ష్ సరదాగా రాజమౌళితో అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్స్ అని చెప్పిన రాజమౌళి… కొమరం భీముడో సాంగ్ తన ఆల్ టైం ఫేవరేట్ అన్నారు. నా డైరెక్షన్ కెరీర్లో అంత గొప్ప సన్నివేశాలు చిత్రీకరించలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అంటే… అతని ఒక కనుబొమ్మపై కెమెరా ఉంచితే… దానితో కూడా నటించగలడు, అని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెంచేలా హాలీవుడ్ మీడియా వేదికపై మాట్లాడారు.

SS Rajamouli On NTR
SS Rajamouli On NTR

కాగా ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఏదో ఒక విభాగంలో ఆర్ ఆర్ ఆర్ అవార్డు సొంతం చేసుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ఆస్కార్ బరిలో సైతం నిలిచింది. దర్శకుడు రాజమౌళి ప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుపొందారు. ఆర్ ఆర్ ఆర్ మరిన్ని అంతర్జాతీయ గౌరవాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper