Chennai: అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరో అమ్మాయి లింగ మార్పిడి చేసుకుంది. ఈ విషయం దాచి అమ్మాయి అతని ప్రేమలో పడింది. కానీ, చివరకు అసలు విషయం తెలిసింది. తర్వాత మరో అబ్బాయిని సదరు అమ్మాయి ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న అబ్బాయిగా మారిన అమ్మాయి దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన దక్షిణ చెన్నైలోలో డిసెంబర్ 23న జరిగింది.
స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని..
చిన్ననాటి స్నేహితురాలైన ఓ యువతి నందిని(26) అంటే మరో యువతి మురుగేశ్వరికి చాలా ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అమ్మాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే సమాజం ఒప్పుకోదు. తాను ప్రేమిస్తున్న నందిని కూడా ఇందుకు అంగీకరించదు అని భావించింది. దీంతో లింగమార్పిడి ఒక్కటే ఇందుకు పరిష్కారమని భావించింది. అమ్మాయి కాస్త అబ్బాయిగా మారిపోయింది. మురుగేశ్వరి కాస్త బెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది.
లైంగిక కోరిక తీర్చాలని..
లింగమార్పిడి తర్వాత బెట్రిమారన్ తన లైంగిక కోరిక తీర్చాలని ప్రేయసి నందినిని పదేపదే కోరడం ప్రారంభించాడు. క్రమంగా వేధింపులకు దారితీసింది. దీంతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చెడిపోయింది. విభేదాలు వచ్చాయి. కానీ, ఇద్దరూ ఒకరికొకరు టచ్‌లోనే ఉన్నారు. ఐటీలో బీఎస్సీ పూర్తి చేసిన నందిని 8 నెలల కిందటే చెన్నెలో ఉద్యోగం సంపాదించి తల్లితో కలిసి ఉంటోంది. శనివారం నందిని పుట్టిన రోజు. దీంతో బెట్రిమారన్ నందినికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. బయటకు రావాలని కోరాడు. దీంతో ఇద్దరూ బయట కలిశారు. బెట్రిమారన్ నందినికి కొన్ని కొత్త బట్టలు కొన్నాడు. అయితే నందిని వాటిని అనాథ శరణాలయానికి అందించింది. ఆ తర్వాత బెట్రిమారన్, నందిని బైక్‌పై ఇంటికి బయల్దేరారు.
ఫొటోలు దిగుదామని..
బెట్రిమారన్ పొన్మార్ సమీపంలో ఎవరూ లేని ప్రాంతంలో బైక్ ను ఆపాడు. లొకేషన్ బాగుందని, ఫొటోలు దిగుదామని చెప్పాడు. నందినిని ఫొటోకి పోజులివ్వమని అడిగాడు. అనంతరం తనతో పాటు తెచ్చిన చైన్‌ను నందిని చేతులు, కాళ్లు కట్టేసి సరదాగా ఇలా చేస్తున్నానని నమ్మించాడు. నందిని గొలుసు తీయాలని ఎంత కోరినా బెట్రిమారన్ వినలేదు. ఆ తర్వాత బ్లేడుతో నందిని మెడ, చేతులు నరికేశాడు. నందినిపై సీసాలో పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు చనిపోయే ముందు నందిని పోలీసులకు ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది.
నంబర్ ఆధారంగా విచారణ..
పోలీసులు నందిని ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ నంబర్ బెట్రిమారన్‌దిగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారణ చే శారు. బెట్రిమారన్ సంఘటనా స్థలానికి వచ్చి తాను నందిని స్నేహితుడినని ఒప్పుకున్నాడు. పోలీసులు, స్థానికులు కలిసి నందిని మృతదేహాన్ని క్రోంపేట ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బెట్రిమారన్ అక్కడ్నుంచి ఫెరార్ అయ్యాడు.
విచారణలో విస్తుపోయే నిజాలు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు డిసెంబర్ 24న ఎట్టకేలకు బ్రెటిమారాన్ను అరెస్టు చేశారు. నందినిపై తనకు ఎలాంటి పగ లేదని బ్రెటిమారాన్ పోలీసులకు తెలిపాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు నిరాకరించడం, మరో యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని బెట్రిమారన్ సహించలేకపోయాడు. ఈ క్రమంలోనే నందినిని ప్లాన్ ప్రకారం చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.