https://oktelugu.com/

Payal Rajput: మంగళవారం’ పాయల్ రాజ్ పుత్ జాతకాన్ని ఎలా మార్చేసిందంటే?

మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ముద్ధుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారారు. మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజాతో పాటు వెంకీమామ, జిన్నా, ఆర్డీఎక్స్ లవ్ వంటి పలు సినిమాల్లో నటించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 25, 2023 / 05:48 PM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: పాయల్ రాజ్ పుత్.. తెలుగు ఇండస్ట్రీలో ఈమె పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉన్న ఈ పంజాబీ భామ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే తనదైన శైలితో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి చిత్రమైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన పాయల్ రాజ్ పుత్ యువత మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పుకోవచ్చు. అభిమానుల మదిలో గుబులు పుట్టించిన ఈ భామ యువతరం ఆరాధ్య నాయకగా ఆరాధించబడుతున్న పాయల్ తన మార్క్ ను వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..

    మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న ముద్ధుగుమ్మ వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారారు. మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజాతో పాటు వెంకీమామ, జిన్నా, ఆర్డీఎక్స్ లవ్ వంటి పలు సినిమాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు ఏవీ అనుకున్న విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.. ఈ క్రమంలోనే ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ మరోసారి నటించారు. ‘మంగళవారం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాయల్ జీవితాన్ని మార్చేసింది.

    మంగళవారం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు పాయల్ రాజ్ పుత్ తనదైన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సక్సెస్ సాధించడం మంచి టాక్ రావడంతో పంజాబీ భామకు మరోసారి మూవీ అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ ఈ ముద్ధుగుమ్మకు ఛాన్స్ లు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ సుందరి సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ గా కనిపిస్తారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు.