Yuntai Waterfall China: చైనీస్ ఉత్పత్తులకు గ్యారెంటీ ఉండదు.. వారంటీ అంతకంటే ఉండదు. ఎందుకంటే వారి వన్ని డూప్లికేట్ ఉత్పత్తులు. కానీ ఈ ప్రపంచం డూప్లికేట్ గాళ్ళనే ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది.. అందువల్లే చైనాకు ఎప్పటికీ గిరాకీ ఉంటుంది.. దీనినే అదునుగా తీసుకొని అది రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.. అయితే అలాంటి చైనాకు సంబంధించిన ఓ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
చైనాలోని హెనాల్ ప్రాంతంలో యుంటాయ్ అనే పేరుతో ప్రసిద్ధ పర్యాటక జలపాతం ఉంది. 1,024 అడుగుల ఎత్తులో చైనాలోని అతిపెద్ద జలపాతంగా ఇది పేరుపొందింది. ప్రతి ఏడాది ఏడు మిలియన్లకు పైగా పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శిస్తారు.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. చైనాలోని మౌంటైన్ పార్కులో ఈ జలపాతం ఉంటుంది.
ఇటీవల ఈ జలపాతం పైకి ఓ హైకర్ ఎక్కాడు. అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కింది నుంచి చూస్తే ఆకాశం నుంచి వస్తున్న నీరు నిజమైనది కాదని తెలుసుకొని ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. ఆ కొండ పై వరకూ ఒక పెద్ద పైపును ఏర్పాటు చేసి.. దానిద్వారా జలపాతాన్ని సృష్టిస్తున్నట్టు అతని పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని మొత్తం అతడు తన ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది దెబ్బకు వైరల్ గా మారింది.
ఆ వీడియోను చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.. “చైనాలో తయారయ్యే ప్రతి వస్తువు నకిలీనే. చివరికి జలపాతం కూడా నకిలీదేనా? ప్రపంచంలో అందమైన జలపాతాన్ని సందర్శించామనే భావనలో చాలామంది పర్యాటకులు ఉన్నారు. కానీ అదంతా పైపు ద్వారా సృష్టించిందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చైనా అంటేనే డూప్లికేట్. వాటికి ఎలాంటి పరిమితులు ఉండవు” అంటూ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో అక్కడి అధికారులు స్పందించారు.. యుంటాయ్ మౌంటైన్ పార్క్ నిర్వాహకులను ప్రశ్నించారు.. వర్షపాతం తక్కువగా ఉండడం, నీటి ఎద్దడి వల్లే తాము ఇలాంటి ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ పర్యాటక ప్రాంతం ప్రభ తగ్గకుండా ఉండేందుకే తాము ఆ ఏర్పాటు చేశామని, పైపు ద్వారా పంపించేది స్ప్రింగ్ వాటర్ అని.. దానివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వారు వివరణ ఇచ్చారు.
This is 1,024-foot-tall Yuntai Mountain Waterfall in China. It is China’s tallest waterfall.
Everyone thought it was natural & billions of year old.
Until recently, some tourists observed that a pipeline was being used to feed this waterfall
Chinese fakery is something… pic.twitter.com/95c8ZGQOSF
— Incognito (@Incognito_qfs) June 7, 2024