Delhi: అతడు ఒక పోలీసు. పేరు సురేంద్ర రాణా. వయసు 42 సంవత్సరాలు. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. నేరాలను నియంత్రించి, శాంతి భద్రతలను పర్యవేక్షించే ఉద్యోగం చేస్తున్న అతడు దారి తప్పాడు. నేరగాళ్ళను పట్టుకొని ఆదర్శవంతంగా నిలవాల్సిన వాడు.. తనే ఒక నేరగాడయ్యాడు. చివరికి అతడు చేసిన నేరం బయటపడింది. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దేశ రాజధానిలో ఈ కేసు సంచలనం సృష్టించింది.
సురేంద్ర అనే వ్యక్తి ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్లో మోనా అనే యువతీ 2014లో కానిస్టేబుల్ గా చేరారు. అప్పట్లో వీరిద్దరూ ఢిల్లీ కంట్రోల్ రూమ్ కు డిప్యూటేషన్ పై వెళ్లారు. అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత మోనా కు ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత తన సహచరులు చెప్పిన సలహా ప్రకారం ఎస్సై ఉద్యోగానికి సెలవు పెట్టి సివిల్స్ వైపు అడుగులు వేసింది. సివిల్స్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. సురేంద్ర మాత్రం ఆమెను అనుసరిస్తూనే ఉన్నాడు. మొదట్లో దీనిని అంత సులభంగా తీసుకున్న మోనా.. తర్వాత అతడిని వారించింది. అయితే 2021 సెప్టెంబర్ 8న వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమం లోనే సురేంద్ర ఆమెను బైక్ మీద ఎక్కించుకుని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి చంపేశాడు. మృత దేహాన్ని డ్రైనేజీ కాలువలో పడేసి.. పైకి తేలకుండా శవం పై పెద్ద రాళ్లను పెట్టాడు.
అనంతరం అక్కడి నుంచి సురేంద్ర రకరకాల కుయుక్తులకు పాల్పడ్డాడు. మన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి..అరవింద్ అనే వ్యక్తితో ఆమె వెళ్లిపోయినట్టు చెప్పాడు. ఆమె కోసం తాను గాలిస్తున్నట్లు వారిని నమ్మించాడు. వారితో కలిసి పలుమార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళాడు. ఆమె బతికే ఉందని నమ్మించేందుకు ఒక మహిళకు కరోనా వ్యాక్సిన్ వేయించి.. మోనా పేరుతో సర్టిఫికెట్ సృష్టించాడు. ఆమె సిమ్ కార్డు ఉపయోగించాడు. బ్యాంకు లావాదేవీలు కూడా చేశాడు. ఈ సమయంలో అరవింద్ స్థానంలో తన బామ్మర్ది రాబిన్ ను ప్రవేశపెట్టాడు. అతనితో అరవింద్ లా మాట్లాడించాడు. మోనా ఆచూకీ లభించిందని పలు నగరాలకు ఆమె కుటుంబ సభ్యులను తీసుకెళ్లాడు. అయితే రాబిన్.. హర్యానా, డెహ్రాడూన్, రిషికేష్, ముస్సోరిలోనే వివిధ హోటళ్లకు వ్యభిచారులతో కలిసి వెళ్లేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోనాకు సంబంధించిన ఏదో ఒక గుర్తింపు కార్డును వదిలి వెళ్ళేవాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు కూడా వచ్చి వెళ్ళింది మోనా అనే అనుకున్నారు. మోనా తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో మధ్యమధ్యలో సురేంద్ర తన వద్ద ఉన్న మోనా ఆడియో రికార్డులను ఎడిట్ చేసి కుటుంబ సభ్యులకు పంపేవాడు.
రెండు నెలల క్రితం ఈ కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చేరింది. వారు అరవింద్ పేరిట రాబిన్ చేస్తున్న ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేయడంతో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వాటిని లోతుగా విచారించడంతో అసలు గుట్టు రట్టయింది. అనంతరం
మోనా అవశేషాలను మురుగు కాలువ నుంచి వెలికి తీశారు. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మోనా చదువులో మొదటి నుంచి చురుగ్గా ఉండేది. బీఈడీ కూడా పూర్తి చేసింది. మరో వైపు సురేంద్రకు భార్య, 12 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మోనా ఉన్నత స్థాయి అధికారి అవుతుందనే నమ్మకంతో సురేంద్ర ఆమె వెంటపడ్డాడు. అతడిని తండ్రి లాగా భావించానని చెప్పడంతో ఆగ్రహానికి గురై ఆమెను చంపేశాడు. స్వతహాగా పోలీస్ కావడం, నేరాల దర్యాప్తులో తనకు ఉన్న అనుభవాన్ని వాడుకొని రెండు సంవత్సరాలు పాటు పోలీసులు, మోనా సభ్యులను తప్పుదోవ పట్టించాడు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A delhi police constable has been arrested for murdering a former colleague two years ago
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com