Liveing On Cruise Ship: భూమ్మీద బతికే మనిషికి అన్నీ సమస్యలే… ఇంటి రెంట్ మొదలుకుని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్‌లో బతకడం అంటున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్‌లో నివసించడం మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీ పేర్కొంటున్నారు. క్రూయిజ్ షిప్‌లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు ఇందుకోసం 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు.
274 రోజుల ప్రయాణం కోసం..
రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు.. ఇప్పుడు ఫోన్ బిల్లు, షిపి‍్పంగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. కొన్ని క్రెడిట్ కార్డులు తమ వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపై ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, ఇతర బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తర్వరలోనే ఈ దంపతులు రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు.
విల్లా వీలో ప్రయాణం..
క్రూయిజ్‌లో ప్రయానించేందుకు ఈ దంపతులు విల్లా వీని ఎంచుకున్నారు. ఈ షిప్ శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దానిలో క్యాబిన్‌ను కూడా కొనుగోలు చేశారు. ఈ షిప్‌లోని ప్రయాణికుల్లో 30 శాతం నిత్యం ఇందులోనే ఉంటారు. మిగిలిన ప్రయాణికులు యూఎస్ పౌరులు.
ధరలు ఇలా..
ఈ క్రూయిజ్ షిప్‌లో క్యాబిన్ ధర 99 వేల డాలర్లు (ఒక డాలర్ రూ.83). సముద్రం కనిపించేలా ఉన్న బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్‌లో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్లో పుల్‌డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ చార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది.
వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు..
ఇక ‘విల్లా వీ’లో దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారని షిప్ సీఈఓ మైకేల్ పెటర్సన్ తెలిపారు. జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారని పేర్కొన్నారు. ఈ భారీ షిప్ ప్రతీ మూడేళ్లకోసారి భూగోళాన్ని చుట్టివస్తుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. ఇక జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌక అని చెబుతున్నారు.