https://oktelugu.com/

Murari Re Release: వీడియో: ఓవైపు మురారి సినిమా చూస్తూ.. యువతీయువకుడు చేసిన పని వైరల్

కాలం మారుతున్నా కొద్దీ పెళ్లిళ్లు చేసుకునే విధానం మారుతుందని చెప్పుకున్నాం కదా.. అయితే ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణమైపోయాయి. అందులో ముఖ్యంగా ఆర్యసమాజ్, గుళ్ళల్లో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో పెళ్లిళ్లు చేసుకోవడం పెరిగిపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 9, 2024 / 08:08 PM IST

    Murari Re Release

    Follow us on

    Murari Re Release: పెళ్లంటే నూరేళ్ళ పంట. ఒక పెళ్లి జరగాలంటే బంధుమిత్రులు, కుటుంబ పరివారం, స్నేహితులు కచ్చితంగా ఉండాలి. వీరందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ సందడే వేరే తీరుగా ఉంటుంది. వారు ఇచ్చే దీవెనలు వధూవరులకు కొండంత బలంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో పెళ్లిళ్లు వైభవంగా జరుగుతుంటాయి. అందుకే ఆకాశమంత పందిరి, భూ దేవంత మండపం అనే నానుడి పుట్టింది. పెళ్లిలను ఆయా సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరుపుతుంటారు. ఇందుకోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. విందులు, వినోదాలకు పెద్దపీట వేస్తుంటారు. కాలం మారుతున్నా కొద్దీ వివాహాలు జరిగే తీరు పూర్తిగా మారుతోంది. అయినప్పటికీ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పైగా పెళ్లిళ్ల విషయంలో కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆచారాలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల పెళ్లిళ్లు మరింత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ యువతీ యువకుడు చేసుకున్న పెళ్లి మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ వారు ఏం చేశారంటే..

    కాలం మారుతున్నా కొద్దీ పెళ్లిళ్లు చేసుకునే విధానం మారుతుందని చెప్పుకున్నాం కదా.. అయితే ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణమైపోయాయి. అందులో ముఖ్యంగా ఆర్యసమాజ్, గుళ్ళల్లో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో పెళ్లిళ్లు చేసుకోవడం పెరిగిపోయింది. కొందరైతే ఏకంగా పోలీసుల సమక్షంలోనే వివాహాలు చేసుకుంటున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇంకా కొందరు స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకొని.. వారి సహాయంతో ఎక్కడికైనా వెళ్లిపోతున్నారు. అయితే వీటన్నింటికీ మించి ఓ యువతీ యువకుడు పెళ్లి చేసుకున్న విధానం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.. శుక్రవారం టాలీవుడ్ హీరో మహేష్ బాబు జన్మదిన పురస్కరించుకొని అతను నటించిన మురారి సినిమాని రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఓ థియేటర్లో ఆ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను చూసేందుకు మహేష్ బాబు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ అభిమానుల్లో ఓ యువతి యువకుడు ఉన్నారు. అయితే వారిద్దరూ కొంతకాలంగా గాఢ ప్రేమలో ఉన్నారు. పైగా వారిద్దరూ మహేష్ బాబు అభిమానులు కూడా. ఇంకేముంది అభిమాన నటుడు ఎలాగూ తమ పెళ్ళికి రాడని భావించి.. మురారి సినిమా ఎండింగ్ కార్డ్స్ పడుతుండగా.. సోనాలి బింద్రే మెడలో మహేష్ బాబు తాళి కడుతుండగా.. ఆ యువతీ మెడలో ఆ యువకుడు కూడా తాళికట్టాడు.

    ఈ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ వీడియో చర్చకు దారితీస్తోంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ” సినిమా థియేటర్లలో సినిమాలు చూసాం. భక్తి రస సినిమాలు విడుదలైనప్పుడు అక్కడ అమ్మోరు లేదా ఇతర దేవుళ్ళ విగ్రహాలు ప్రతిష్టించడం చూశాం. కానీ తొలిసారిగా పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు పెళ్లి మండపాలుగా మారిపోతున్నాయి. ఇంతకు మించిన వింతలు విశేషాలు ఇంకా ఎన్ని చూడాలో.. ఇంతకీ ఆ యువతి, ఆ యువకుడి పెళ్లికి సంబంధించిన వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో? ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడే యువత.. చివరికి పెళ్లి విషయంలోనూ తమ ఆత్రాన్ని ఆపుకోవడం లేదు. ఏంటో ఈ కాలం పిల్లలు” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.