https://oktelugu.com/

Jabardasth: జబర్దస్త్ లేడీ కమెడియన్స్ ని వేధిస్తున్న టీమ్ లీడర్స్… అలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

జబర్దస్త్ అత్యంత పాపులర్ కామెడీ షో. అయితే ఈ షోలో లేడీ కమెడియన్స్ ని టీమ్ లీడర్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఓ లేడీ కమెడియన్ ని నేరుగా టీమ్ లీడర్ చెప్పినట్లు చేయకపోతే నెక్స్ట్ స్కిట్ లో ఛాన్స్ ఇవ్వనని బెదిరించాడు. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : August 9, 2024 / 08:02 PM IST

    jabardasth

    Follow us on

    Jabardasth: జబర్దస్త్ వేదికగా పాపులారిటీ దక్కించుకుంది సీరియల్ నటి వర్ష. ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్కిట్స్ చేస్తూ లేడీ కమెడియన్ గా ఆనతి కాలంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తోపాటు స్పెషల్ ఈవెంట్స్ వంటివి చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే వర్ష కి ఓ అనుకోని సంఘటన ఎదురైంది. జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఓ కమెడియన్ ఆమె పరువు తీసే విధంగా వ్యాఖ్యలు చేశాడు. పైగా చెప్పినట్లు చేయకపోతే మరోలా ఉంటుంది అంటూ వర్ష ని బ్లాక్ మెయిల్ చేశాడు.

    సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది వర్ష. అభిషేకం, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్కిట్స్ చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇమ్ము తో వర్ష లవ్ ట్రాక్ బాగా హైలెట్ అయింది. వీరిద్దరూ నిజమైన లవర్స్ అని ఆడియన్స్ నమ్మారు. అంతగా ఈ జంట ప్రేక్షకుల్ని నమ్మించారు. ఆ తర్వాత అదంతా కేవలం షో కోసమే చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

    ప్రస్తుతం వర్ష జబర్దస్త్ లో ఇమ్ము టీం లో ఎక్కువగా స్కిట్స్ చేస్తూ అలరిస్తుంది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో వర్ష కి షాక్ తగిలింది. ఇమ్ము చేసిన పనికి వర్ష నోరెళ్లబెట్టింది. అసలేం జరిగిందంటే .. ఇమ్మాన్యుయేల్, కమెడియన్ వెంకీ కలిసి స్కిట్ చేశారు. వెంకీ, ఇమ్మూ ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటారు. ఒకరిని మరొకరు తిట్టుకుంటూ ఉంటారు. పొద్దునే ఇలాంటి మొహాలు చూడాల్సి వస్తుంది అని ఇమ్ము అంటాడు. దానికి వెంకీ రివర్స్ కౌంటర్ ఇస్తాడు.

    ఇలా వాళ్ళు వాదించుకుంటూ ఉండగా వర్ష స్టైల్ గా ఎంట్రీ ఇస్తుంది. నన్ను ఆశీర్వదించు మామయ్య అంటూ వెంకీ కాళ్ళు మొక్కుతుంది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కడానికి కింద కూర్చుంటుంది. అలా కాసేపు వర్ష ని కింద కుర్చోపెడతాడు. ఎందుకు రా అది అంతసేపు కూర్చుంది అని వెంకీ అడుగుతాడు. అలా చేయకపోతే నెక్స్ట్ స్కిట్ లో ఉండదు అంటూ ఇమ్ము వర్ష ని బెదిరిస్తాడు.

    ఇమ్మానియేల్ కామెడీగా ఈ డైలాగ్ చెప్పినప్పటికీ నిజం లేకపోలేదు అనేది నిజం. గతంలో షకలక శంకర్ స్కిట్ లో భాగంగా అప్పారావును కొరడాతో కొట్టాలి. అప్పారావుని షకలక శంకర్ నిజంగానే కొడతాడు. దాంతో ఆగ్రహానికి గురైన అప్పారావు నిజంగా కొడతావేంటి, నేను చేయను అని ఫైర్ అవుతాడు. షకలక శంకర్ నీకు ఇంకా చాలా స్కిట్స్ లో ఛాన్స్ ఇస్తా అంటాడు. అయితే కొట్టుకో అని అప్పారావు అంటాడు.

    జబర్దస్త్ లో టీమ్ లీడర్ మెయిన్. కమెడియన్స్ కి చాన్సులు, పేమెంట్స్ వంటి విషయాలు టీమ్ లీడర్ చేతిలో ఉంటాయి. ఈ క్రమంలో లేడీ కమెడియన్స్ ని కూడా టీమ్ లీడర్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల టీమ్ లీడర్ అయిన ఇమ్మానియేల్ వర్షను బెదిరిస్తున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.