Nagarjuna: అక్కినేని ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. గత మూడు తరాల నుంచి వాళ్లు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ మంచి సినిమాలను చేసి సక్సెస్ ల పరంగా కూడా ముందు వరుసలో నిలుస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘తండేల్ ‘ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను చోరగొంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రేక్షకులు చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదిలా ఉంటే ఆయన 2017 సంవత్సరంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక 2021 లో వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు రావడంతో డివోర్స్ తీసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు శోభితా ధూళిపాళ తో నాగచైతన్య ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే ఒక ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున నాగచైతన్య గురించి మాట్లాడుతూ సమంతతో డివోర్స్ అయినప్పుడు నాగచైతన్య చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడని ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదని, తను ఒక్కడే సైలెంట్ గా ఉండేవాడని చెబుతూనే ఒక మూడు సంవత్సరాల పాటు నరకం చూశాడని ఇప్పుడు శోభితతో ఎంగేజ్ మెంట్ అవ్వడం తో తను చాలా హ్యాపీగా ఉన్నాడని చెబుతూనే చైతును అలా చూడటం తమ కుటుంబ సభ్యులందరికీ సంతోషం గా ఉందని చెబుతున్నాడు. ఇక మొత్తానికైతే అక్కినేని ఫ్యామిలీ మరోసారి చాలా సంతోషంగా కనిపించడం నిజంగా మన అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది.
గత కొన్ని సంవత్సరాల నుంచి నాగచైతన్య సినీ కెరియర్ పరంగా గాని, పర్సనల్ విషయాల్లో గాని చాలా డిప్రెషన్ లో ఉంటున్నాడు. ఇక ఎప్పుడు ఆయనకు అంత మంచి జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నాగ చైతన్య శోభితాల పెళ్లి తొందర్లోనే జరగబోతుంది అంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు… ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో పాటు మరొక రెండు సినిమాలకు కూడా కమిటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సినిమాలను కూడా తొందర్లోనే అనౌన్స్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అలాగే అఖిల్ కూడా మరొక కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక నాగార్జున కూడా ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను ఎలాగైనా సరే మంచి సక్సెస్ ని అందుకుంటానని చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ మెయిన్ హీరో కాగా, నాగార్జున ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తూ ఉండటం విశేషం…చూడాలి మరి ఇక మీదట అక్కినేని హీరోల సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయి అనేది…