Maharashtra: మహారాష్ట్రలోని ఘాట్ రోడ్డులో ఓ బస్సు మంగళవారం(జూలై 9)న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్ కంట్రోల్ తప్పడంతోనే ఈ దుర్ఘటన చోటు జరిగింది. అయితే ప్రమాదానికి ముందు ఘాట్ రోడ్డు అందాలను ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీస్తుండగా.. ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లడం కూడా అందులో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భయంకరమైన మలుపులు..
మహారాష్ట్రలోని ఘాట్ రోడ్డు అంటేనే భయంకరమైన మలుపులతో కూడి ఉంటుంది. అలాంటి ఘాట్ రోడ్డులో ప్రయాణించాలంటే చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది. ప్రమాదకరమైన మలుపులను దాటాలంటే వాహన డ్రైవర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న పొరపాటు చేసినా.. ఆ వాహనంలో ఉన్న వారి ప్రాణాలు గాల్లో కలిసినట్టే. అతి వేగం, ఓవర్‌టేక్‌లు లేకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఏ మాత్రం తొందరపడినా.. ప్రమాదం జరగడం ఖాయం.
ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో..
తాజాగా ఓ ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఘాట్ రోడ్డులో ముందు వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేసిన బస్సు.. అదుపు తప్పి నేరుగా లోయలోకి దూసుకెళ్లింది. మూలమలుపు వద్ద వేగంగా లారీని ఓవర్ టేక్ చేసిన బస్సు డ్రైవర్.. ఆ బస్సుపై కంట్రోల్ తప్పాడు. దీంతో అది అదుపు తప్పి లోయలో పడింది.
ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. లైవ్ వీడియో తీవారు.
ఇద్దరు చిన్నారుల మృతి..
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా.. 58 మందికి గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని హుటాహుటిన లోయలోనుంచి బయటికి తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
వీడియో తీసిన ప్రయాణికుడు..
అయితే సాత్పూరా ఘాట్ అందాలను ఆ బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు వీక్షిస్తూ.. తన ఫోన్లో వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం కూడా ఆ వీడియోలో రికార్డ్ అయింది. బస్సు మూలమలుపు వద్ద టర్న్ తీసుకోకుండా డైరెక్ట్‌గా వెళ్లి లోయలో పడటం కనిపిస్తోంది. బస్సు లోయలోకి దూసుకెళ్లిన తర్వాత అందులో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి. బస్సు లోయలో పడగానే ఫోన్ ఎగిరి బస్సులో పడటంతో వీడియో కనిపించకపోయినా ఆడియో మాత్రం వినిపిస్తోంది.
अंगावर शहारे आणणारा हा व्हिडीओ…
नाशिकमध्ये बस दरीत कोसळली, अपघाताचा LIVE व्हिडीओ समोर आला…. pic.twitter.com/gmonkugZKN— Ganesh (@GaneshD56174762) July 9, 2024
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A bus carrying 60 passengers fell into a deep ravine at saputara ghat killing two
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com