Rohit Sharma: మెల్ బోర్న్ మైదానంలో ఓడిపోవడంతో టీమిండియా పై తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొంది. ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించి ఉత్సాహం మీద ఉంది. దీంతో సిడ్ని టెస్టులో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో మార్పులు చేయాల్సిన సందర్భం ఉంది. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించాల్సిన తరణం కూడా ఉంది. అందువల్లే టీమిండియా సిడ్ని టెస్ట్ లో సరికొత్త ఆట తీరు ప్రదర్శించాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. అయితే ఈ టెస్ట్ కు ముందు రోహిత్ శర్మ అభిమానులకు గుండె పగిలే వార్త ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సిడ్ని టెస్ట్ కు రోహిత్ శర్మ దూరంగా ఉంటాడని.. వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో అతడు ఐదవ టెస్ట్ ఆడడని తెలుస్తోంది. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. రకరకాల కథనాలు ప్రసారంలో ఉన్నాయి. అయితే వీటిపై ఎవరు ఇంతవరకు క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు.
తప్పుకున్నాడట
గత కొంతకాలంగా రోహిత్ సరిగ్గా ఆడటం లేదు. దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. కెప్టెన్ గా జట్టును విజయ మార్గంలో తీసుకెళ్లడంలో సత్తా చాటలేకపోతున్నాడు. అందువల్లే అతనిపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఒత్తిడి తీవ్రంగా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టి20 మాదిరిగానే టెస్టులకు కూడా విరామం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ కు దూరంగా ఉంటాడని జట్టు మేనేజ్మెంట్ నర్మ గర్భంగా వ్యాఖ్యానిస్తోంది.. పిచ్ కండిషన్ తర్వాతే జట్టులో ఎవరుంటారు? ఎవరు ఆడతారు? నాయకత్వం ఎవరు వహిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తుందని కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. అంటే ఈ ప్రకారం సిడ్ని టెస్టులో రోహిత్ శర్మ ఆడేది అనుమానమేనని.. అతడి స్థానంలో విరాట్ కోహ్లీ లేదా బుమ్రా జట్టుకో నాయకత్వం వహించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఫామ్ కూడా సరిగా లేదు కాబట్టి.. అతని స్థానంలో బుమ్రా కే జట్టు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఒకవేళ గనుక అతడు జట్టుకు నాయకత్వం వహిస్తే..పెర్త్ టెస్ట్ మాదిరిగా టీమిండియా విజయం సాధిస్తే.. అప్పుడు రోహిత్ శర్మ తప్పుకోవలసి ఉంటుందని.. క్రికెట్ ఎక్స్ పర్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ” రోహిత్ ఫామ్ సరిగా లేదు. అలాంటప్పుడు అతను తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నాడు. ఒకవేళ గనుక అదే జరిగితే టీమ్ ఇండియాలో సంచలనం చోటు చేసుకున్నట్టే. ఇది ఒక రకంగా రోహిత్ అభిమానులకు గుండెలు పగిలే వార్త. చూడాలి మరి ఏం జరుగుతుందోనని”క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.