Maharashtra : మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా దట్టమైన అటవీ ప్రాంతాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఇటీవల కేబుల్ లేయింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పనులను నిర్వహిస్తోంది. ఈ పనుల్లో పాలుపంచుకోవడానికి శ్రీకాంత్ రామచంద్ర సాత్రే (23) అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో వచ్చాడు. వీరి ముగ్గురిది పేద కుటుంబం కావడంతో.. ఎంతోకొంత సంపాదించడం కోసం ఈ పనుల్లోకి కుదిరారు. అయితే వారు పనిచేస్తున్న గడ్చిరోలి జిల్లాలో చిట్ట గాండ్ అనే దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక ఏనుగు ఒకటి బయటికి వచ్చింది. అది అబాపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రామచంద్ర సాత్రే తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. పని మధ్యలో గురువారం ఉదయం తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం.. చుట్టూ సెలయేళ్లు, కొండలు ఉండడంతో ఆ వాతావరణం వారు ఆస్వాదించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ సరదాగా గడిపారు. వారు అక్కడ అలా ఉండగానే ఏనుగు కనిపించింది. అయితే ఏనుగు కు దూరం నుంచి సెల్ఫీ దిగాలని శ్రీకాంత్ భావించాడు. ఐతే ఆ ఏనుగుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వారిని వెంబడించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో శ్రీకాంత్ ఆ ఏనుగు కు దొరికిపోయాడు. దీంతో అది తొండంతో అత్యంత దారుణంగా అతనిపై దాడి చేసింది. అంతేకాదు తన కాళ్లతో తొక్కింది. అత్యంత బరువైన ఏనుగు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే రక్తం కక్కుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే మిగతా ఇద్దరు పరుగు లకించుకోవడంతో ప్రాణాలను కాపాడుకున్నారు.
అదే ఏనుగు కోపానికి కారణం
సెల్ఫీ దిగే సమయంలో శ్రీకాంత్ రకరకాల హావా భావాలు ప్రదర్శించినట్టు అతడి స్నేహితులు చెబుతున్నారు. దీంతో ఆ ఏనుగుకు కోపం వచ్చిందని తెలుస్తోంది. అందువల్లే ఆగ్రహంతో ఊగిపోయింది. గట్టిగా అరుపులు అరుస్తూ అతని మీదకి దూసుకు వచ్చింది. అయితే అతడు వేగంగా పరుగులు పెట్టకపోవడంతో ఏనుగుకు దొరికిపోయాడు. దీంతో ఆ ఏనుగు తొండంతో అతడిని గట్టిగా కొట్టింది. ముందరికాళ్ళతో తొక్కి తొక్కి చంపింది. ఆ ఏనుగు తొక్కిన తొక్కుడుకు శ్రీకాంత్ పక్క టెముకలు విరిగాయి. ఉదర భాగం పలిగింది. నోటి భాగం నుంచి రక్తం వచ్చింది. సెల్ఫీలు దిగ సమయంలో శ్రీకాంత్ అరవడంతో ఆ ఏనుగు తనకు ఏదో కీడు జరుగుతోందని భావించింది.. అందువల్లే అతడిపై దాడికి పాల్పడింది. మిగతా ఇద్దరు స్నేహితులు పరుగుపెట్టి వారి ప్రాణాలు కాపాడుకోగా.. శ్రీకాంత్ మాత్రం వేగంగా పరుగు పెట్టలేకపోయాడు. దీంతో ఏనుగు అతనిని పట్టుకొని చంపేసింది. ఈ సంఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. కాగా ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీకాంత్ మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి పంపించారు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Srikanth was attacked and killed when he went to take a selfie with the elephant
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com