Game Changer Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియా సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఒక పవర్ స్టార్ హీరోకి ఎలాంటి ట్రైలర్ పడితే రికార్డ్స్ బ్లాస్ట్ అవుతుందో, అలాంటి ట్రైలర్ ఇది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. టీజర్ కి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, ఎందుకో శంకర్ మార్క్ కనిపించలేదు, నిరాశ చెందాము అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ ట్రైలర్ కి మాత్రం రామ్ చరణ్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. వింటేజ్ శంకర్ మార్క్ సినిమాని చూసి చాలా కాలం అయ్యిందని, ట్రైలర్ ని చూస్తుంటే ఆయన కెరీర్ లో మరో బెస్ట్ మూవీ రాబోతున్నట్టు అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి విడుదలైన మూడు గంటల్లోనే నాలుగు లక్షల లైక్స్, 12 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతానికి పబ్లిక్ గా కేవలం నాలుగు మిలియన్ల వ్యూస్ మాత్రమే అప్డేట్ అయ్యాయి. ట్రాఫిక్ భారీగా ఉన్నప్పుడు వ్యూస్ అంత తొందరగా అప్డేట్ అవ్వవు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి కూడా అదే జరుగుతుంది. అయితే అర్థరాత్రి అయ్యేలోపు ఈ ట్రైలర్ కచ్చితంగా 5 లక్షల లైక్స్ ని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు అభిమానులు . ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో ఆరు లక్షల లైక్స్ వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ ఆ లైక్స్ కౌంట్ ని రేపు ఉదయం లోపు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ట్రైలర్ జనాలకు విపరీతంగా నచ్చింది అనే విషయం.
అయితే ఎన్ని పాన్ ఇండియన్ సినిమాలు విడుదలైనా పవన్ కళ్యాణ్ రికార్డు ని బద్దలు కొట్టలేకపోతున్నారు. ఆయన నటించిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ కి కేవలం మూడు నిమిషాల్లో లక్ష లైక్స్ వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో ప్రభాస్ ‘సలార్’ చిత్రం నిలబడగా, మూడవ స్థానంలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం ట్రైలర్ నిల్చింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ 24 గంటల్లో 7 లక్షల లైక్స్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ కి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఆ రేంజ్ కి ప్రస్తుతానికి ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చేరుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకున్న చిత్రాలు భీమ్లా నాయక్, సలార్, వకీల్ సాబ్ మరియు #RRR. ఈ రికార్డ్స్ ని ఎవరు బద్దలు కొడుతారో చూడాలి.