Homeట్రెండింగ్ న్యూస్Bull Attack: చూస్తుండగానే నరకం గేట్ ఎంట్రన్స్ టచ్ చేసి వచ్చాడు.. వైరల్ వీడియో

Bull Attack: చూస్తుండగానే నరకం గేట్ ఎంట్రన్స్ టచ్ చేసి వచ్చాడు.. వైరల్ వీడియో

Bull Attack: శూల దండం.. కుంబీ పాకం. క్రిమీ భోజనం.. ఇవన్నీ అపరిచితుడు సినిమా ద్వారా శంకర్ మనకు పరిచయం చేశాడు. నరకం అంటే ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించాడు. అవన్నీ చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టింది. శరీరమంతా జలదరించింది. ఇవన్నీ లైవ్ లో చూస్తే ఎలా ఉంటుంది.. పోనీ ఈ అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది.. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

తెలంగాణకు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగరంలో మహాలక్ష్మి లేఅవుట్ పేరుతో ఓ ప్రాంతం ఉంటుంది. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు స్థిరపడ్డారు. ఆ ప్రాంతం చేనేత కార్మికులకు.. మార్బుల్ తయారీకి పేరు పొందింది. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి పని మీద బయటికి వెళ్తున్నాడు. తన ద్విచక్ర వాహనం మీద పయనిస్తున్నాడు. 40 స్పీడ్ మీద తన బండిని నడుపుతున్నాడు. అతడు అలా వెళ్తుండగానే.. ఆ మార్గంలో ఓ గంగిరెద్దు ఒక్కసారిగా ఆ ద్విచక్ర వాహనం మీద పయనిస్తున్న వ్యక్తిని గట్టిగా కొమ్ములతో నెట్టింది. గంగిరెద్దు నెట్టిన నెట్టుడుకు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. అదే సమయంలో ఒక లారీ వెళ్తోంది. సైడ్ మిర్రర్ లో ఆ ద్విచక్ర వాహనదారుడు పరిస్థితి చూసి ఒక్కసారిగా సడన్ బ్రేకేసి ఆపాడు. లేకుంటే టైర్ కింద అతని తల పగిలిపోయేది. చూస్తుండగానే ప్రాణం పోయేది. ఆ క్షణం లో గంగిరెద్దు నెట్టడం.. కింద పడిపోవడం.. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపడం.. ఆ వాహన దారుడికి క్షణాల్లో జరిగిపోయాయి. ఒక క్షణం లారీ డ్రైవర్ బ్రేక్ వేయకుంటే అతడు చూస్తుండగానే చనిపోయేవాడు.. తల పగిలి నిండు జీవితాన్ని నెత్తురోడుతూ రోడ్డు మీదే వదిలేసేవాడు. అదృష్టం బాగుండి ఆ లారీ డ్రైవర్ బ్రేక్ చేయడంతో బతికి బట్ట కట్టాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “నరకం గేట్ ఎంట్రన్స్ టచ్ చేసి వచ్చావు. అర్జెంటుగా వెళ్లి లారీ డ్రైవర్ కు సన్మానం చెయ్.” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు..”లారీ డ్రైవర్ కు ఓ దండం.. నరకం స్పెల్లింగ్ రాయించిన గంగిరెద్దు” అంటూ మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.”జంతువులకు నీరు పెట్టరు. ఆహారం అందించరు.. అవి సకాలంలో అందక పిచ్చెక్కిపోయి ఇలా వ్యవహరిస్తుంటాయని” ఇంకో నెటిజన్ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version