Bihar: టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. ప్రేమ, పెళ్లి గురించి.. కులాలు, పట్టింపులు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోవడం లేదు. కులం పట్టింపుల కారణంగా కొన్ని కులాల్లో అమ్మాయిలు కూడా దొరకక అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సామాజికవర్గాల్లో కులాంతర వివాహాలను ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. అయితే చాలా సామాజికవర్గాలు వేరే కులం అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవడాన్ని ఒప్పుకోవడం లేదు. ఇక బిహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కుటుంబ ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించిన యువకుణ్ని ఓ యువతి కులాంతర వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు బైక్‌పై వచ్చి సినీ ఫక్కీలో అత్తారింటి నుంచి తనను ఎత్తుకెళ్లాడు. బిహార్‌లోని అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు..
రూప, చోటు కుమార్ ఠాకుర్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కుటుంబసభ్యులను కాదని జూన్ 2న కులాంతర వివాహం చేసుకుంది. ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరుసటిరోజే.. మరో వ్యక్తితో కలిసి వచ్చి అత్తారింట్లో నుంచి సోదరిని బలవంతంగా బైకుపై ఎత్తుకెళ్లాడు. స్థానికులు ఈ ఘటనను సెల్ఫోన్లతో వీడియో తీశారు.
పోలీసులకు ఫిర్యాదు..
అయితే రూప మేజర్ కావడం అబ్బాయి తరఫు బంధువులకు కలిసి వచ్చింది. దీంతో వెంటనే అబ్బాయి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. రూపను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బథ్నాహ పోలీసులు యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. రూప వాంగ్మూలం తీసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
పెళ్లి వరకు వెళ్లిన ప్రేమ నిలబడాలని..
ప్రేమ పెళ్లిళ్లు చాల వరకు విఫలమవుతాయని, కొన్ని రోజులకే విడిపోతారనే అపవాదు ఉంది. చాలా వరకు జంటలు విడిపోవడానికి పెద్దల జోక్యం కారణమవుతోంది. ఈ నేపథ్యంలో రూప, చోటుకుమార్ ఠాకూర్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే ఇందులో కూడా పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి మనసు మారకుండా ఉండాలని, వారి ప్రేమ గెలవాలని, పెళ్లి నిలవాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు.