Viral News : అలా ఇంటికి వచ్చే క్రమంలో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అది కాస్త శారీరక బంధానికి దారితీసింది. భర్త ఇంటికి వెళ్ళిపోవడమే ఆలస్యం.. ఆమె అతడిని పిలిపించుకునేది.. భర్త వచ్చేదాకా సరస సల్లపాలలో మునిగి తేలేది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అతనికి ఏమో పెళ్లీడు వయసు వచ్చినప్పటికీ.. ఆమె పెళ్లి చేసుకొనివ్వడం లేదు. అతడేమో పెళ్లి మీద దృష్టి సారించడం లేదు. తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ అతడు వాయిదా వేస్తున్నాడు. సంవత్సరాలకు సంవత్సరాలు ఇలా వాయిదా వేస్తున్న నేపథ్యంలో.. తమ కుమారుడి మీద ఆ తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఇంకేముంది ఒకరోజు రెక్కి నిర్వహించారు.. అతడు తమ సమీప బంధువుల ఇంటికి వెళ్తున్నాడని… ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గుర్తించారు. తమకు ఏమి తెలియనట్టుగానే నటించారు. ఆ తర్వాత ఒకరోజు వేసుకున్న ప్లాన్ ప్రకారం అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిని విచారించారు. అతడు కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. ఆమె బుకాయించడానికి ప్రయత్నించింది. ఇంకా ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని ఆలోచించి.. రెండవ మాటకు తావు లేకుండా.. ఆమె భర్తను పిలిపించారు.. విషయం మొత్తం చెప్పారు. అతడేమో గుండెలు పగిలే విధంగా రోదించాడు.. చివరికి ఆ అబ్బాయి బంధువులు చెప్పిన మాటలకు ఒప్పుకున్నాడు.. తన సమక్షంలోనే తన భార్యకు ఆ యువకుడితో పెళ్లి జరిపించాడు.
ఇక ఈ దృశ్యాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ మీమర్ పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ” తనకు బంధువుల వరుస అయ్యే ఓ మహిళతో ఓ యువకుడు సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. అది శారీరక సంబంధానికి దారి తీసింది.. అది కాస్త అతడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు ఆ మహిళతో, అతడికి పెళ్లి చేశారు. అతడి తిక్క కుదిరించారు. ఆమె మోహానికి సరైన సమాధానం చెప్పారు.. అయితే ఆ భర్త తన భార్య ద్వారా కలిగిన సంతానాన్ని తన వద్దే ఉంచుకుంటున్నాడు. ఎందుకంటే తల్లి దగ్గరికి పంపిస్తే ఆమె బుద్ధులే వారికి కూడా వస్తాయనే భయంతో అతడు జాగ్రత్తపడ్డాడు. సత్ప్రవర్తన మధ్య వారిని పెంచుతున్నాడని” ఆ మీమర్ వ్యాఖ్యానించాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి బంధాలు మంచివి కావని హితవు పలుకుతున్నారు. ” చాటుమాటు సంబంధాలు మంచివి కావు. అవి కుటుంబాలను నాశనం చేస్తాయి. ఇటీవల ఇతర సంఘటనలు పెరిగిపోవడం సమాజంలో జరుగుతున్న పెడ పోకడలను సూచిస్తున్నాయి. ఇలాంటి వాటికి యువత అలవాటు పడకూడదు. అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదు. విలువైన భవిష్యత్తు ఉన్నవారు ఇటువంటి బంధాలకు బానిస కావద్దని” నెటిజన్లు సూచిస్తున్నారు.