Bihar Board Exams: బీహార్ రాష్ట్రంలో పేదరికం ఎక్కువ. మొన్నటివరకు అక్కడ తల్లిదండ్రులు ఆడపిల్లలకు చదువు చెప్పనిచ్చేవారు కాదు. యుక్త వయస్సు కు రాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఆడపిల్లలు నెల తప్పేవారు. తద్వారా చిన్న వయసులోనూ ప్రసవించేవారు. దీనివల్ల అక్కడ ఆడపిల్లల్లో రక్తహీనత అధికంగా ఉండేది. పోషకాహార లోపం కూడా ఉండేది. పుట్టిన పిల్లల్లో కూడా ఎదుగుదల అంతంతమాత్రంగానే ఉండేది. దీనికి చరమగీతం పాడేందుకు అక్కడి ప్రభుత్వాలు ఆడపిల్లల చదువును ప్రోత్సహించాయి. ఆడపిల్లలు చదువుకుంటే ప్రభుత్వాల పరంగా ఆర్థిక భరోసా ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో ఆడపిల్లల్లో చదువుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. బోర్డు స్థాయి విద్య వరకు బాగానే ఉన్నప్పటికీ.. బోర్డు పరీక్షల్లో పాస్ కావడం ఆడపిల్లలకు ఇబ్బందికరంగా మారిపోయింది. బీహార్ బోర్డు పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఇందులో పాస్ అవ్వడం ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలకు కూడా ఇబ్బందే. అందువల్లే ఆ మధ్య బీహార్ బోర్డు పరీక్షల్లో తమ పిల్లలకు చీటీలు ఇవ్వడానికి తల్లిదండ్రులు ప్రయత్నించిన తీరు జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలోనూ చర్చకు కారణమైంది.
Also Read: ఐటీ కంపెనీలే కాదు.. స్టార్టప్ ల్లోనూ అదే దురవస్థ.. ఈ ఉద్యోగి ఆవేదనే దీనికి నిదర్శనం!
తల్లిదండ్రులు భయపడిపోతున్నారు
బీహార్ లో జరుగుతున్న బోర్డు పరీక్షల్లో ఆడపిల్లలు కనక ఉత్తీర్ణత సాధించకపోతే తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేస్తుంటారు. తమకు నచ్చినవాడిని పెళ్లి చేసుకోవాలని ఆడపిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. అందువల్లే చాలామంది ఆడపిల్లలు బోర్డు పరీక్షల సమయంలో తమ ప్రేమికులతో లేచి పోతుంటారు. నుదుటన సింధూరం పెట్టించుకోని వెళ్లిపోతారు. ఇటీవల ఓ యువతికి ఓ అబ్బాయి పాపిట సింధూరం పెట్టి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే పరీక్షల్లో పాస్ కావడం విషయంలో ఏమైనా అనుమానం ఉంటే ఆడపిల్లలు తమకు నచ్చిన వారితో వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోవడం.. తాము మేజర్ల మని.. తమకు రక్షణ కావాలని వారిని కోరడం వంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. దీంతో బోర్డు పరీక్షలు వచ్చాయని తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతోంది. ” ఇక్కడి ఆడపిల్లలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆంక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందువల్లే వారు బోర్డు పరీక్షల్లో సరిగా రాయరు. తల్లిదండ్రులు ఎలాగూ పెళ్లి చేస్తారు కాబట్టి.. అదేదో తమకు నచ్చిన వాటిని చేసుకుంటేనే బాగుంటుందని వారు భావిస్తారు. అందువల్ల తమకు నచ్చిన వాడితో వెళ్లిపోతారు. ఆ తర్వాత బతుకువేటను మొదలుపెడతారు. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో నూటికి నూరు శాతం అన్యోన్యంగా ఉంటున్నాయని” బీహార్ మీడియా చెబుతోంది. అయితే ఆడపిల్లలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించగా పోతున్న నేపథ్యంలో బోర్డు పరీక్షలను కాస్త సరళతరం చేయాలని బీహార్ విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది.