Devara 2 : సినిమా ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ఇక అలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీ రేంజ్ లో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటికే ఆయన వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక మరో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్న స్టార్ హీరోగా ఒక రికార్డును క్రియేట్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)హీరోగా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా భారీ విజయాన్ని సాధించింది. 500 కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వేల్ గా దేవర 2 (Devara 2) సినిమా వస్తుందంటూ మొదటి పార్ట్ ఎండింగ్ లోనే అనౌన్స్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన కథను రెఢీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2(War 2) సినిమాను కంప్లీట్ చేసుకొని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ప్రశాంత్ నీల్ సినిమా ముగిసిన తర్వాత (Devara 2)సినిమా పట్టాలెక్క అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా మొదటి పార్ట్ ఎండింగ్ లో దేవరను వర చంపినట్టుగా చూపించి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు.
Also Read : దేవర 2 కోసం కసరత్తులు చేస్తున్న కొరటాల శివ…వర్కౌట్ అవుతుందంటారా..?
మరి ఆ ట్విస్ట్ కి కట్టుబడి సెకండ్ పార్టీ రాసుకుంటారా లేదా అనే ధోరణిలోనే కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. కానీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవర చనిపోవడట బతికే ఉంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే దేవర బతికి ఉంటే మొదటి పార్ట్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ఫుల్ ఫీల్ అవ్వదు కదా అని కొంతమంది అంటున్నారు.
మరి కొంత మంది మాత్రం ఆ క్లైమాక్స్ లో ఫేక్ ట్విస్ట్ ఇచ్చారంటూ చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా కొరటాల శివ అసలు దేవర 2 సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతుందనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి…
ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ ను రెట్టింపు చేస్తూ దేవర సినిమా ఉండబోతుందట. మరి ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారు. ఒకవేళ వరను చంపకపోతే దానిని ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎలా కన్వే చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…