https://oktelugu.com/

Uber Driver: కేవలం బైక్ ఉంటే చాలు రూ. 80000 వేలు సంపాదించవచ్చు. ఎలాగంటే?

బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ చాలా సంపాదిస్తున్నాడు. ఈయన ఏకంగా నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. తన సంపాదన గురించి ఆయన చెబుతూ ఓ వీడియో చేశాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 12, 2024 / 09:21 PM IST

    Uber Driver

    Follow us on

    Uber Driver: సంపాదించాలనే తపన ఉంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు. కష్టపడే తత్వం, డబ్బు గురించిన ఆలోచన, ఫ్యూచర్ గురించి ప్లాన్ ఉంటే డబ్బుల కోసం ఎంత కష్టమైన పడతారు కొందరు. వారి లైఫ్ ను రిస్క్ పెట్టైనా సరే డబ్బు సంపాదిస్తారు. డబ్బు ఎన్నో విధాల అవసరం. ఇక దీన్ని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నవారు చాలా రకాల దారులు వెతుకుతారు. ఒక ఉద్యోగంలో చాలా మంది ఉన్నట్టే ఉంటే కొందరు మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా పెద్ద స్థానంలో నిలబడతారు. దీనికి వారి సంకల్పమే కారణం.

    ఒక ఉబర్, వోలా వంటి డ్రైవింగ్ సంస్థల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది. ఈ సంస్థలో సొంత బైకు, కారు కలిగి ఉన్నవారు డబ్బును సంపాదిస్తున్నారు. ఓన్ గా డ్రైవింగ్ చేయడం, బుకింగ్స్ రావడం కష్టం. సో ఇలా ఓ కంపెనీ ద్వారా బుకింగ్స్ తెచ్చుకుంటూ ఆ సంస్థ ఆధీనంలో నడుస్తూ బుకింగ్స్ తో ఎక్కువ మొత్తాన్ని సంపాదిస్తున్నారు. అయితే కొందరు కేవలం నార్మల్ ఖర్చుల కోసమే సంపాదిస్తున్నారు. కొందరు జస్ట్ టైమ్ పాస్ అంటూ వెళ్తున్నారు. హాలీడే సమయాల్లో వీటి ద్వారా డబ్బులు సంపాదించే వారు కొందరు అయితే మరి కొందరు ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ ఎక్కువగా సంపాదిస్తున్నారు. మరికొందరు ఏకంగా వేలు, లక్షల్లో కూడా సంపాదిస్తున్నారు. కేవలం బైక్ ద్వారా ఈ రేంజ్ లో సంపాదించడం కష్టమే కదా. కానీ సులభం అంటున్నాడు ఓ బైక్ డ్రైవర్. అదెలా అంటారా?

    బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ చాలా సంపాదిస్తున్నాడు. ఈయన ఏకంగా నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. తన సంపాదన గురించి ఆయన చెబుతూ ఓ వీడియో చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆయన నెల జీతం విని నెటిజన్లు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను ఒకరు షేర్ చేశారు.

    ఈ వీడియోలో ఉన్న వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారు. అయితే ఆయన మాట్లాడిన దాని ప్రకారం రోజుకు 13 గంటలు పనిచేస్తాడట. నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాడట. ఎవరు నన్ను ఏం అనేవారు లేరని.. ఎవరి మాట పడాల్సిన అవసరం కూడా లేదని అంటున్నాడు ఆయన. నాకు నేను యజమానిని అన్నాడు. అంతేకాదు ఈ రేంజ్ లో సంపాదిస్తున్న అంటే అాందరూ నవ్వుతారని.. నమ్మరని కూడా అన్నాడు. కానీ నిజంగా ఆ వ్యక్తి నెలకు ప్రతి రోజు 13 గంటలు పని చేసి ఏకంగా రూ.80000 సంపాదిస్తున్నాడట. ఈ వీడియోను డిసెంబర్ 4న షేర్ చేశారు. షేర్ చేసిన 5 రోజుల్లోనే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ ఉబర్ బైక్ డ్రైవర్ చెప్పిన మాటలను విని చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా.