Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుకి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. విలక్షణడిగా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలవడం అనేది అందరిని ఇబ్బందికి గురిచేస్తుంది. ముఖ్యంగా తన కొడుకు అయిన మనోజ్ విషయంలో ఆయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ మనోజ్ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా ఆయన మీడియా రిపోర్టర్ మీద దాడి చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన ఎందుకు అలా చేశాడనే దానికి సమాధానంగా ఆయన ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ అందులో ఏముంది అని ఒకసారి మనం తెలుసుకుందాం…
మొన్న నైట్ మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం తో న్యూస్ రిపోర్టర్లు వాళ్ళింటికి వచ్చారు. ఇక అక్కడికి వస్తున్న మోహన్ బాబును ఒక రిపోర్టర్ ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో కోపానికి వచ్చిన మోహన్ బాబు ఒకసారిగా ఆయన మైక్ తీసుకొని ఆ రిపోర్టర్ మీదనే దాడి చేశాడు. అందులో రిపోర్టర్ తో పాటు కెమెరా మేన్ కి కూడా తీవ్రమైన గాయాలు అయితే అయ్యాయి. మరి ఆయన మీద 109 సెక్షన్ మీద కేసు కూడా నమోదు అయింది. ఇక అటెప్ట్ టు మర్డర్ అనే పర్సెప్షన్ లో పోలీసులు కేసు ఫైల్ చేశారు… ఇక అదే రోజు కొంచెం అస్వస్థతకు గురైన మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఇక ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన గత కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యాడు.
ఇక ఇంటికి వచ్చిన మోహన్ బాబు ఒక ఆడియోని రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ ఆడియో లో ఏముందంటే తమ కుటుంబానికి సంబంధించిన విషయం రాజకీయ నాయకులకు గానీ, మీడియా మిత్రులకు గాని, ఇతర వ్యాపారస్తులు గానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
తమ సమస్యలను తాము పరిష్కరించుకోగలం అలా కాకుండా మీడియా వాళ్ళు నా ఇంటి మీదికి వచ్చి నన్ను క్వాషన్స్ అడగడం ఇక అప్పటికే నాకు ఇతర వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను.
ఇలాంటి సందర్భంలో మీడియా ముసుగులో ఎవరైనా కొంతమంది వచ్చి నామీద ఎటాక్ చేయవచ్చనే ఉద్దేశ్యం తోనే నేను అలాంటి చర్యకు పాల్పడ్డాను తప్ప ఉద్దేశ్య పూర్వకంగా చేసిందైతే కాదు. ఇక ఇలాంటి సంఘటన జరిగినందుకు నేను చాలా వరకు చింతిస్తున్నాను అంటూ తన ఆడియోలో తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఇక తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తను సాల్వ్ చేసుకుంటానని చెప్పాడు…