Odisha: నీ కష్టం పగోడికి కూడా రావద్దు అయ్యా.. ఇంత ఆత్మాభిమానం ఎందుకు సామీ..!*

సంపాదించినా.. సంపాదించకపోయినా.. ఆకలితో ఉన్నా.. కడుపు నింపుకున్నా.. ధనికుడిగా ఉన్నా.. కటిక పేదరికంలో ఉన్నా ప్రతీ మనిషికి ఆత్మాభిమానం(సెల్ఫ్‌ రెస్పెక్ట్‌) ఉంటుంది. అది లేని మనిషి మనిషే కాదు.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 5:17 pm

Odisha

Follow us on

Odisha: మనిషికి పంచ ప్రాణాలు ఉన్నాయంటారు పెద్దలు.. ఆ పంచ ప్రాణాలతోపాటు ఆత్మాభిమానం(సెల్ఫ్‌ రెస్పెక్ట్‌) అనే ఆరో ప్రాణం చాలా మందిలో కనిపిస్తోంది. ఈ రోజుల్లో అది తుగ్గుతోంది. ఆత్మాభిమానం అని మడికట్టుకుంటే ఆపద నుంచి గట్టెక్కడం లేదు. ఆకలి తీరడం లేదు. అందుకే చాలా మంది దీనిని వదిలేస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఆత్మాభిమానం కోసం ప్రాణాలు వదిలేవారు ఉన్నారు.

సంపాదించినా.. సంపాదించకపోయినా.. ఆకలితో ఉన్నా.. కడుపు నింపుకున్నా.. ధనికుడిగా ఉన్నా.. కటిక పేదరికంలో ఉన్నా ప్రతీ మనిషికి ఆత్మాభిమానం(సెల్ఫ్‌ రెస్పెక్ట్‌) ఉంటుంది. అది లేని మనిషి మనిషే కాదు. అయితే కొన్ని సందర్భాల్లో దానిని పెద్దగా పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆత్మాభిమానం దెబ్బతింటే ఊరుకోరు. ఆత్మాభిమానం ఉన్నవారు.. ఎంత కష్టంలో ఉన్నా మరొకరివద్ద చేయి చాచరు. ఎవరి సాయం కోరరు. కష్టాలను తానే ఎదుర్కొనాలని భావిస్తారు. ధైర్యంతో చాలా మంది కష్టాలను అధిగమిస్తారు. నేటి సమాజంలో ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకుని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ, ఈ రోజుల్లో కూడా ఓ వ్యక్తి ఆత్మాభిమానం చంపుకోలేక కష్టాలు కొని తెచ్చుకున్నాడు. దీనికి సబంధించిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సెల్ఫ్‌ రెస్పెక్‌ ఎలాం ఉంటుందో చూపిన వృద్దుడు..
ఇలాంటి సమాజంలో ఓ వృద్ధుడు సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. తన వద్ద చార్జీకి డబ్బులు లేవు. ఎవరినైనా అడుగుదామంటే.. ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. చేయి చాచి యాచించలేక ఏకంగా పది, ఇరవై కాదు.. ఏకంగా 600 కిలోమీటర్లు నడుచుకూంటు వచాచడు. ఒడిశా రాష్ట్రం దుమరబెడకు చెందిన సోనో భద్ర అనే 65 ఏళ్ల వృద్ధుడు కూలీ పని కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ, ఇక్కడ ఆయనను చూసి పని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చార్జీలకు సరిపడా డడ్బులు లేక 14 రోజులు నడుచుకుంటూ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాడు. మధ్యలో ఎవరైనా భోజనం పెడితే తింటూ.. అలసిన చోట విశ్రాంతి తీసుకుంటూ నడక సాగించాడు. అతని గురించి తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంత ఆత్మాభిమానం ఎందుకు స్వామి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అప్పు తీసుకుని ఇంటికి వెళ్లి తీరిస్తే బాగుండు అని కొందరు.. యాచించడం నేరం కాదు అని కొందరు.. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం కోరడం తప్పు కాదు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

అన్నీ వదిలేస్తున్న నేటి తరం..
ఇదిలా ఉంటే.. నేటి రోజుల్లో మనుషులు అన్నీ వదిలేస్తున్నారు. ఆత్మాభిమానం ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఆత్మాభిమానం అని కూర్చుంటే బతకలేం అని చాలా మంది పేర్కొంటున్నారు. దానిని చంపుకుని పనిచేస్తేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాయంటున్నారు. భార్య బిడ్డలను పోషించుకోవాలన్నా.. ఆత్మాభిమానం పక్కన పెట్టాల్సిందే అని సూచిస్తున్నారు.