https://oktelugu.com/

Narendra Modi : ప్రధాని మోదీకి ఇష్టమైన పరోటా.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు

మునగాకు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ డయాబెటిక్ వంటి లక్షణాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సహాయపడుతుంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 18, 2024 5:24 pm
    Parotta Health Benefits

    Parotta Health Benefits

    Follow us on

    Narendra Modi : భారత ప్రధాని మోదీ ఈ వయస్సులో కూడా చాలా యంగ్‌గా కనిపిస్తారు. కేవలం ఫిట్‌గా మాత్రమే ఉండటంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉన్నారు. దీనికి ముఖ్య కారణం అతను తీసుకునే ఆహారం. మనం తినే ఆహారం, వ్యాయామం.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే పరోటా అంటే చాలా మందికి ఇష్టం. చాలామంది దీనిని ఇష్టంగా తింటారు. ఇందులో చాలా రకాలున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ ఆరోగ్యానికి ఒక సీక్రెట్ ఉందని అందరూ అనుకుంటున్నారు. అతను రోజూ పరోటా తింటారు. దీనివల్లే ఆరోగ్యంగా ఉన్నారట. అయితే అతను కేవలం పరోటా తినకుండా.. మునగాకుతో చేసిన పరోటాను తింటారట. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అందులో ప్రధాని మోదీ 74 ఏళ్ల వయస్సులో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. అనారోగ్యాన్ని ఇచ్చే ఆహారాలను కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలను మాత్రమే ప్రధాని మోదీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు.

    మునగాకు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ డయాబెటిక్ వంటి లక్షణాలు మునగాకులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా కూడా చేస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లు మునగాకు పరోటాను రోజూ తినడం వల్ల కంట్రోల్ అవుతుంది. అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఈ మునగాకు పరోటా వల్ల దూరం అవుతాయి. అయితే పరోటాలో నచ్చని వాళ్లు మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చు. మునగాకు వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండె ప్రమాద సమస్యలు రాకుండా కూడా తగ్గిస్తుంది. ఈ మునగాకుని పొడి చేసుకుని కూడా తిన్న ఆరోగ్యానికి మంచిదే.

    మునగాకు పరోటా తయారు చేయడం ఎలా?
    తాజా మునగాకును తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఒక పది నిమిషాలు పాటు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా చేసుకుని.. గోధుమ పిండిలో వేసి కలపాలి. ఇందులో వాము, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, జీలకర్ర అన్ని వేసి బాగా కలుపుకోవాలి. వీటిని పరోటాలా తయారు చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి తక్షణమే శక్తి కూడా వస్తుంది. దీనికి చికెన్, దుంపలు, పనీర్ వంటి కూరలతో తినవచ్చు. మీ టేస్ట్ బట్టి కర్రీ వండుకోవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.