Nagarjuna: ‘రోలెక్స్’ ని మించిన పాత్రలో కనిపించబోతున్న నాగార్జున..మరి ఇంత క్రూరమా..వైరల్ గా మారిన ‘కూలీ’ వీడియో!

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో 'కూలీ' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా ఇప్పటికే విడుదలైంది.

Written By: Vicky, Updated On : September 18, 2024 5:08 pm

Akkineni Nagarjuna

Follow us on

Nagarjuna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోలలో టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా నిల్చిన సూపర్ స్టార్స్ లో ఒకరు అక్కినేని నాగార్జున. నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున, తన తండ్రిలాగా కాకుండా, తనకి నచ్చిన దారిలో వెళ్తూ, అశేష ప్రేక్షాభిమానం పొంది టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. ఫ్యామిలీ హీరో గా, క్లాస్ హీరో గా, రొమాంటిక్ హీరో గా, మాస్ హీరో గా, భక్తుడిగా ఇలా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలలో కనిపించిన నాగార్జున, పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో మాత్రం ఇప్పటి వరకు కనిపించలేదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అంతం’ చిత్రం లో నెగటివ్ షేడ్ రోల్ లో కనిపించాడు కానీ, అది పూర్తి స్థాయి కాదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఆయన క్రూరమైన విలన్ గా నటించబోతున్నాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ‘కూలీ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ చిత్రం లో నాగార్జున విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆయన పాత్ర పేరు ‘సిమోన్’. నాగార్జున పుట్టినరోజు నాడు ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు మేకర్స్. దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో నాగార్జున ఒక మంచి పాత్రలో నటిస్తున్నాడని అప్పట్లో అనుకున్నారు కానీ, విలన్ రోల్ లో నటిస్తున్నాడని ఈరోజు సోషల్ మీడియా లో లీక్ అయిన ఒక వీడియో ని చూస్తే అర్థం అయ్యింది. ఈ వీడియోలో పోర్టులో అందరూ పరిగిస్తూ ఉంటారు. తెల్లని సూట్ ధరించిన నాగార్జున సుత్తి తీసుకొని ఒక మనిషిని అతి దారుణంగా ముఖం మీద నాన్ స్టాప్ గా కొట్టి చంపుతాడు. ఒక పవర్ ఫుల్ డైలాగ్ ని కూడా తమిళ్ లో పలుకుతాడు. నాగార్జున ని అంత వయొలెంట్ గా చూసిన ఆయన అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.

చాలా కాలం తర్వాత నాగ్ ని లోకేష్ ఒక పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తున్నాడని అర్థం అయ్యింది అంటూ చెప్పుకొస్తున్నారు. విక్రమ్ సినిమాలో హీరో సూర్య క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అతి క్రూరంగా తన సహచరులను చంపడం మనం చూసాము. ఈ సినిమాలో ఆయన కనిపించింది కేవలం 5 నిమిషాలే అయినప్పటికీ, ఇండియా మొత్తం ఆ క్యారక్టర్ ద్వారా రీ సౌండ్ వచ్చేలా చేసాడు. ఈరోజు కూలీ చిత్రంలో నాగార్జున క్యారక్టర్ ని చూస్తే అంతకంటే క్రూరంగా అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే ఇన్ని రోజులు హీరో రోల్స్ లో మాత్రమే చూసి నాగార్జునని ఆరాధించిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు ఈ నెగటివ్ రోల్ లో ఆయన్ని చూడగలరా లేదా అనేది చూడాలి.