https://oktelugu.com/

తెలుగు స్టార్ పై బాలీవుడ్ హీరోల టెన్షన్ !

టాలీవుడ్ లో డార్లింగ్ ప్ర‌భాస్ నంబర్ వన్ హీరో ఏమి కాదు, కానీ ఒక్క బాహుబలి సిరీస్ ప్రభాస్ ని నేషనల్ స్టార్ ను చేసింది. వందల కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేసింది. అందుకే ఏ సౌత్ హీరోకి దక్కని ఛాన్స్ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో దక్కింది. ఆ మాటకొస్తే.. బాలీవుడ్ స్టార్లు కూడా అసూయ పడే ఛాన్స్ ఇది. లేకపోతే ఒక ప్రాంతీయ భాషా హీరో మీద 700 వందల […]

Written By:
  • admin
  • , Updated On : August 19, 2020 / 02:22 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో డార్లింగ్ ప్ర‌భాస్ నంబర్ వన్ హీరో ఏమి కాదు, కానీ ఒక్క బాహుబలి సిరీస్ ప్రభాస్ ని నేషనల్ స్టార్ ను చేసింది. వందల కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేసింది. అందుకే ఏ సౌత్ హీరోకి దక్కని ఛాన్స్ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో దక్కింది. ఆ మాటకొస్తే.. బాలీవుడ్ స్టార్లు కూడా అసూయ పడే ఛాన్స్ ఇది. లేకపోతే ఒక ప్రాంతీయ భాషా హీరో మీద 700 వందల కోట్లు పెట్టి సినిమా చేస్తారని ఎవరైనా ఉహించారా.. అసలు ప్రభాస్ కూడా అనుకోని ఉండడు, త‌న కెరీర్ లో అత్యద్భుతంగా భారీ స్థాయిలో నిర్మించే తొలి 3డి మూవీలో హీరోగా న‌టిస్తానని.

    Also Read: అరె.. లేడీ సూపర్ స్టార్ కి మళ్ళీ పెళ్లి !

    ఇప్పటివరకూ ఏ సౌత్ హీరో సాధించలేని లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ లాంటిదే ఇది. సినిమాకి ఏడు వందల కోట్లు అనే విషయం పక్కన పెడితే.. తానాజీ లాంటి అద్భుత‌మైన 3డి విజువ‌ల్ వండ‌ర్ ని క్రియేట్ చేసిన‌ ఓం రౌత్ అనే గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ ఏ – ఆదిపురుష్’ వస్తుండటంతో ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నిటికి కంటే ముఖ్యమైనది ఈ సినిమాని తెలుగు-హిందీ – తమిళ- కన్నడ భాషా చిత్రంగా తెర‌కెక్కించి అటు పై దేశంలోని మిగిలిన అన్ని భాష‌ల్లోనూ.. జపాన్, చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయనున్నారు.

    Also Read:  మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

    విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయడం అనేది ఈ మధ్య ఇండియన్ సినిమాలకు చిన్న విషయమే. అయితే, ఇలాంటి భారీ 3డి ఇండియన్ సినిమాని ఎప్పుడూ విదేశాల్లో రిలీజ్ చేయలేదు. ప్రభాస్ ఆదిపురుష్ నే మొదటిసారి కావడం ప్రభాస్ స్థాయిని పెంచేదే. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ భారతీయ సినిమాల పై ఉన్న అన్ని రికార్డుల్ని ఈ ఆదిపురుష్ తుడిచేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉండటంతో ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలకు టెన్షన్ పట్టుకుంది. ఈ సినిమాతో నేషనల్ వైజ్ గా ప్రభాస్ మార్కెట్ ఇంకా పెరిగితే బాలీవుడ్ హీరోలు కూడా.. ప్రభాస్ వెనుకే పడిపోతారు. మరి ప్ర‌భాస్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా వెలిగిపోవాలని ఆశిద్దాం.