Air Travel: మనకు తెలిసినంత వరకు విమానాల్లో ప్రయాణించాలంటే ఒక ఎయిర్ పోర్టు నుంచి మరో ఎయిర్ పోర్టుకు ధరలను నిర్ణయిస్తారు. అవి వేల్లలో ఉంటాయి. సామాన్య జనాలు ఎక్కడం చాలా కష్టం కదా. అయితే కిలోమీటరుకు రూ.12 చార్జీ వసూలు చేస్తే ఎలా ఉంటుంది. ఏంటి వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉంది కదూ. కానీ మీరు విన్నది నిజమే. ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఇది సాధ్యం చేయొచ్చని చెబుతోంది.
ఎయిర్‌క్రాఫ్ట్స్ తో ఇది సాధ్యమవుతుందని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాల్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అద్దెకు విమానాలను ఈ సంస్థ నడుపుతోంది. రాబోయే కాలంలో ఈ సంస్థ ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తో ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి దిగనుంది. ఇప్పటికే ఈ పనుల్లో తాము బిజీగా ఉన్నామని, రెండు తయారీ కంపెనీలతో చర్చిస్తున్నట్టు కనిక తెలిపారు.
Also Read: Kurnool District Politics: నేతలు అధికం.. ఉనికి కోసం ఆరాటం
తాము అందుబాటులోకి తీసుకు వచ్చే సర్వీసులను ముందుగా హైదరాబాద్, ముంబై, బెంగళూరులో తెస్తామన్నారు. ఈవీటోల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ తయారీని 12 సంస్థలు చేస్తున్నాయని, అందులో తాము కూడా ఉన్నట్టు వివరించారు. అయితే ఈ ఎయిర్ క్రాప్ట్స్‌ను నడిపేందుకు పైలట్ కూడా అక్కర్లేదని, అయితే ల్యాండింగ్ కోసం మాత్రం ప్యాడ్స్ అవసర పడుతాయంట.
ఈ ఎయిర్ ట్యాక్సీలో నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ ఎయిర్ ట్యాక్సీలు చార్జింగ్ సాయంతో నడుస్తాయని, ఒక్కసారి చార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల దాకా ప్రయాణించొచ్చని కనిక రెడ్డి తెలిపారు. అయితే ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసేందుకు రూ.23 లక్షలు ఖర్చవుతుందని ఆమె వివరించారు. రాబోయే మూడేళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తామంటూ ఆమె వెళ్లడించారు.
అయితే వీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని ఆమె వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం తొలి విడతలో రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. హైదరాబాద్‌లో రూ.30 కోట్లతో ఈ మే నెల వరకు సంస్థను నిర్మిస్తామన్నారు. ఈ ప్రైవేట్ జెట్స్ సంస్థకు ఏమేం కావాలో అవన్నీ కేంద్రమే అందిస్తుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది లోగా మరో నాలుగు జెట్స్, ఒక హెలికాప్టర్ కూడా రానున్నాయి. వీటి సాయంతో తమ సేవలు మరింత విస్తరిస్తామని ఆమె వివరించారు.
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?