Homeఎంటర్టైన్మెంట్Arvind Kejriwal: ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Arvind Kejriwal: ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Arvind Kejriwal: మొన్నటి వరకూ కనీసం ఎవరికీ పరిచయం లేని ఆ సినిమా పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మూవీపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అన్నే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మూవీ టీంను పిలిచి మరీ అభినందించడంతో ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్కడి ప్రభుత్వాలు బాగా సహకరిస్తున్నాయి.

Arvind Kejriwal
Arvind Kejriwal

మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ మూవీపై టాక్స్ ను మినహాయించారు. పైగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూవీని చూడటం కోసం పోలీసులకు ఒక రోజు స్పెషల్ లీవ్ కూడా కేటాయించారు. దీంతో ఈ మూవీపై ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది.

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?

బీజీపీ దాని అనుకూల పార్టీలు ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.. కేసీఆర్ లాంటి వారు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను రాజకీయ ప్రయోజనం కోసమే తెరకెక్కించారని.. దీని వెనకాల బీజేపీ కుట్ర దాగుందని మొన్న కేసీఆర్ మీడియా సాక్షిగా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ మూవీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

The Kashmir Files
The Kashmir Files

అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ మూవీపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చకు తీసుకువచ్చారు. ఈ మూవీకి ఢిల్లీలో టాక్స్ మినహాయించాలంటూ వారు చేసిన విజ్ఞప్తిపై కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఈ మూవీతో ఆ డైరెక్టర్ కోట్లు సంపాదించుకున్నారని.. కాశ్మీర్ పండిట్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నార‌ని, కావాలంటే ఆ సినిమాను డైరెక్టర్ యూట్యూబ్ లో పెడితే అందరు ఫ్రీగా చూడొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read:  బాబుకు కొత్త తలనొప్పి..: అభ్యర్థుల మార్పు అసలుకే మోసం..?

 

LIVE: రాజమౌళి అద్భుతం చేశాడంటున్న ఫ్యాన్స్.! || RRR Movie Public Talk || Ok Telugu Entertainment

Recommended Video:

RRR Telugu Movie Review || Jr NTR || Ram Charan || SS Rajamouli || Ok Telugu Entertainment

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల పాల‌న‌పై జ‌గ‌న్ దృష్టి పెడుతున్నారు. ఉగాది త‌ర్వాత కొత్త జిల్లాల్లో పాల‌న ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలోనే కొత్త జిల్లాల్లో చాలా స‌మ‌స్య‌లు, డిమాండ్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అస‌లే ఏపీ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కాబ‌ట్టి అక్క‌డి నుంచి వ‌స్తున్న డిమాండ్లు ఇప్పుడు జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయాయి. మొద‌టి నుంచి జిల్లాల పేర్లు జ‌గ‌న్‌కు ఇబ్బంది క‌రంగా ఉన్న విష‌యం తెలిసిందే. […]

Comments are closed.

Exit mobile version