Homeట్రెండింగ్ న్యూస్Common Surnames: ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 ఇంటిపేర్లు ఇవే..

Common Surnames: ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 10 ఇంటిపేర్లు ఇవే..

Common Surnames: ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇందులో ఒకరికొకరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. దీంతో ప్రతీ వ్యక్తికి ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకున్నారు. పూర్వకాలంలో టెక్నాలజీ లేనందను ప్రత్యేకమైన పేర్లను పెట్టుకునేవారు. అయితే ఈ పేర్లు చాలా మంది వాడడంతో ఇంటిపేరును చేర్చారు. ఒక ఇంటిపేరు తన కుటుంబ సభ్యులందరినీ గుర్తిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇంటిపేరుతో ఆ వ్యక్తిని గుర్తించే వీలుంటుంది. ఈ విధానం ప్రపంచం మొత్తం ఉంది. అలా కొన్ని ఇంటిపేర్లు ఫేమస్ అయ్యాయి. వాటిలో 10 ఇంటిపేర్ల గురించి తెలుసుకుందాం..

స్మిత్ -ఆస్ట్రేలియా :
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంటిపేరుతో చాలా మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంటిపేరును 114,997 మంది ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2007లో ప్రకటించింది. ఈ ఇంటిపేరుతో ఉన్నవాళ్లలో బెల్లా స్మిత్ (ఫుట్ బాల్ ప్లేయర్), హయాత్ స్మిత్ (అమెరికన్ పొలిటిషియన్), ఏజె స్మిత్ (అమెరికన్ మ్యూజిసియన్), బెల్లా స్మిత్ (ఆస్ట్రేలియా ఫుట్ బాల్ ప్లేయర్) తదితరులు ఉన్నారు.

మార్టిన్ -ఫ్రాన్స్:
మార్టిన్ ఇంటిపేరు చాలా ఫేమస్. రెండో జెమిని కాలంలో ప్రముఖ ప్రొఫెసర్ ఈ పేరును వాడారు. ఆ తరువాత చాలా మంది దీనిని ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఫ్రాన్స్ దేశంలో ఈ పేరుతో 2,30,000 మంది ఉన్నట్లు సమాచారం. మార్టిన్ అనాథల పట్ల దాతృత్వాన్ని చూపేవాడు.

కుమార్-ఇండియా:
కుమార్ ఇంటిపేరును కలిగిన వారు ఇండియాలో చాలా మంది ఉన్నారు. ప్రాచీన భారతదేశంలో సనక, సనాతన, సనందన, సనత్ అనే హిందూ మతం యొక్క పురాణాల గ్రంథాల నుంచి నలుగురు కుమారులకు ప్రతిబింబంగా కుమార్ అనే ఇంటిపేరును వాడుతూ వస్తున్నారు. శివపార్వతిల కుమారుడు కుమారస్వామిని భక్తితో కొలిచేవారు కుమార్ పేరుతో ఇంటిపేరుగా వాడుతున్నారని ప్రచారంలో ఉంది.

సాటో-జపాన్:
జపాన్ లో ప్రసిద్ధి గాంచిన ఇంటిపేరు ఇది. Sa అంటే సహాయం, to విస్టరియా అని అర్థం. ఈ పేరుతో ప్రముఖ జపాన్ బేస్ బాల్ ప్లేయర్ అయామీ సాటో, మధ్య ఆఫ్రికాలోని బాస్కెట్ బాల్ ప్లేయర్ రోమేన్ సాటో ఉన్నారు.

ఇవనోవా-రష్యా:
రష్యాలోని అత్యంత సాధారణ వాడకాల్లో ఉన్న ఇంటిపేరు ఇవనోవా. ఇవాన్ అనే మగ పేరు నుంచి ఇది పుట్టింది. ఇవాన్ అంటే అక్షరాల అని అర్థం. ఈ పేరుతో కజకిస్తాన్ లో ఫుట్ బాల్ ప్లేయర్ అలైనా ఇవనోవా, తదితరులు ఉన్నారు.

ఖాన్- సౌదీ అరేబియా:
టర్కో-మంగోల్ మూలానికి చెందిన ఇంటిపేరు ఖాన్. సాధారణంగా ఖాన్ ఇంటిపేరు కలిగిన వాళ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఇందులో సౌదీ అరేబియాతో పాటు భారత్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లో నూ ఉన్నారు. తూర్పు యురేషియన్ స్టెప్పలోని సంచార తెగల మధ్య ఈ పేరు పుట్టినట్లు సమాచారం.

అలీ-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్:
అరబిక్ మూలం ‘హై’ నుంచి అలీ పేరు పుట్టింది. హై అంటే ఛాంపియన్ లేదా చక్రవర్తి అని అర్థం. ఇస్లామిక్ నాయకుడు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ కు నుంచి అలీని వాడుతున్నట్లు సమాచారం. అలీ అనే ఇంటిపేరు ఇస్లామిక్ సంస్కృతిలో బాగా ప్రసిద్ధి చెందింది. అట్లాంటిక్ బానిస వ్యాపారం ముగిసిన తరువాత ట్రినిడాడ్ , టొబాగో దేశాల్లో బాగా పాపులర్ అయింది. ఆ తరువాత ఆసియా దేశాల్లో విస్తరించింది.

స్మిత్-అమెరికా:
ఆస్ట్రేలియాతో పాటు అమెరికాలోనూ స్మిత్ పేరు బాగా పాపులర్ అయింది. స్మిత్ ఇంటిపేరును ఇంగ్లీష్, స్కాటీష్ లల్లో ఎక్కువగా వాడుతారు. కొంత మంది దక్షిణ ఆప్రికన్-అమెరికన్లు కూడా దీనిని ఇంటిపేరుగా చేర్చుకున్నారు.

అహ్మద్-పాకిస్తాన్:
ఖురాన్ 61:6 ల మూలం నుంచి అహ్మద్ పేరును తీసుకున్నారు. ఇస్లామిక్ పండితులు మహ్మద్ పేరును బాగా ప్రచారం చేశారు. సాహిహ్ అల్-బుఖారీ, సాహిహ్ ముస్లిం ఇతర సాంప్రదాయాలు ఇస్లామిక్ మూలాలనుంచి వచ్చాయని మరికొందరు చెబుతున్నారు.

పెరెరా-శ్రీలంక:
పెరెరా అనే ఇంటిపేరు శ్రీలంకలో ప్రసిద్ధి. పెరెరా అంటే సింహం అని అర్థం. సాధారణ పోర్చుగీస్ పెరీరా (పియర్ చెట్టు) నుంచి ఇది పుట్టింది. ఐబీరియన్ ద్వీపకల్పంలో దీనినే వేరే రకంగా వాడుతున్నారు. అయితే శ్రీలంకంలో మాత్రం చాలా మంది ఇంటిపేరుగా చేర్చుకున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version