Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందాన మోసపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఎప్పటి నుండో ఆమె వద్ద మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఏకంగా రూ. 80 లక్షలు కాజేశాడని సమాచారం. వృతిపరంగా బిజీగా ఉన్న రష్మిక మేనేజర్ పై పూర్తి విశ్వాసం ఉంచారట. డేట్స్, అకౌంట్స్ వంటి కీలక విషయాలు అప్పగించారట. దీంతో అదును చూసి మేనేజర్ దెబ్బేశాడట. పెద్ద మొత్తంలో రష్మిక మందాన డబ్బులు కొట్టేశాడట. ఈ మేరకు మీడియా కోడై కూసింది. ఈ వార్తలపై రష్మిక మందాన స్పందించారు.
ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి మోసం జరగలేదు. నా మేనేజర్ డబ్బులు దొంగిలించలేదు. మేము పరస్పర అవగాహనతో విడిపోయాం. మేము ప్రొఫెషనల్స్. ఎవరి కెరీర్లో వారు మరింత ఎదగాలని కోరుకుంటాము. అందుకే ఆయన నా వద్ద నుండి వెళ్లిపోయారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని సడన్ గా తొలగించడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు రష్మిక చెప్పేది కూడా అబద్ధం కావచ్చని కొందరి అభిప్రాయం.
ఇక తెలుగులో రష్మిక పుష్ప 2లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్ర దర్శకుడు. ఈ క్రేజీ సీక్వెల్ పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 విడుదలయ్యే అవకాశం కలదు. ఇక పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందనే ప్రచారం జరుగుతుంది. సీక్వెల్ లో రష్మిక పాత్ర నిడివి సుకుమార్ తగ్గించారనే వాదన కూడా ఉంది.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యానిమల్. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. అసలు వైలెంట్ ఫిలిం అనే ఎలా ఉంటుందో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే రైన్ బో టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది.