Draupadi: మహాభారతం ఓ అద్బుత గ్రంథం. హిందూ మతానికి ఓ ప్రామాణిక గ్రంథం ఇదే కావడం గమనార్హం. మహాభారత కథలో మనకు ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఇందులో రెండు వంశాల మధ్య జరిగే యుద్ధమే కురుక్షేత్రం. మహాభారంతో ద్రౌపతి పాత్ర విచిత్రంగా రూపుదిద్దుకున్నది. ఆమె ఐదుగురు పతులను కలిగి ఉంటుంది. పూర్వ కాలంలో ఒక భర్త ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉండడం సహజమే. కానీ ఐదుగురు భర్తలు ఒక భార్య ఉండటమే విచిత్రం.

ద్రుపదరాజు కుమార్తె ద్రౌపతి. ఆమెకు తండ్రి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దేశ దేశాల నుంచి బ్రాహ్మణులు వస్తారు. బ్రాహ్మణ వేషంలో పాండవులు కూడా హాజరవుతారు. స్వయంవరంలో మత్స్యయంత్రంను కొట్టిన వారికి తన కూతురిని ఇస్తానని ద్రుపదరాజు ప్రకటిస్తాడు. అందరు ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి అర్జునుడు దాన్ని ఛేదించేందుకు సిద్ధపడతాడు. అందరు వారిస్తారు. వద్దని సూచిస్తారు.
Also Read: ఆమె..’తెలుగు కళామతల్లి’ కన్న తొలి ఆడపడుచు !
అయినా అర్జునుు వినకుండా విల్లును చేతబట్టి మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపతిని చేపడతాడు. కానీ తల్లికి మాత్రం ఆడదాన్ని తెచ్చామని చెప్పకుండా మేమొకటి తెచ్చామని చెప్పడంతో ఐదుగురు పంచుకోమని చెబుతుంది. తరువాత తన మాట వెనక్కు తీసుకుంటున్నానని చెప్పినా వ్యాసుడు ఇది దైవ నిర్ణయమని చెబుతాడు. గత జన్మలో ద్రౌపతి వివాహం కాకపోవడంతో తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని చెప్పగా తనకు ఐదు సుగుణాలు ఉన్న వాడు భర్తగా రావాలని అడుగుతుంది.
ఐదు లక్షణాలు ఒకరిలో ఉండవని కానీ నీకు వచ్చే జన్మలో ఐదుగురు భర్తలుగా వస్తారని చెబతాడు. ఆ ప్రతిఫలంగానే ఇప్పుడు ఆమెకు ఐదుగురు భర్తలు దొరికారని చెప్పి ఐదుగురితో సంసారం చేయాలని సూచిస్తాడు. అయితే ఒకరి వద్ద ఉన్నప్పుడు మరొకరు చూడకూడదనే నియమం పెట్టుకుంటారు. ఒక్కొక్కరి వద్ద సంవత్సరం పాటు ఉంటుంది. కానీ ఓసారి అనుకోకుండా అర్జునుడు ధర్మరాజు వద్ద ఉన్నప్పుడు చూసి పన్నెండేళ్లు వనవాసం చేశాడని పురాణాల్లో ఉంది.
దీంతో ద్రౌపతి వృత్తాంతంపై ఇన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంచపాండవులకు ఒకే ధర్మపత్నిగా ద్రౌపతి పాత్ర అనిర్వచనీయమే. మహాభారతంలో ద్రౌపతి ఐదుగురు భర్తలతో సంసారం చేసినా ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవడమంటే మాటలు కాదు. ఒక భర్తతోనే వేగలేకపోతున్న మహిళలున్న నేటి కాలానికి ఆ కాలానికి ఎంత తేడా ఉందో తెలుస్తూనే ఉంది.
Also Read: బుద్ధుడి తలపై నత్తలు ఎందుకు మరణించాయి..? ఆ కథేంటి..? సంచలన విషయాలివీ