Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ అలా కనిపిస్తే కడుపు మంట సహజం!

Nara Lokesh: లోకేష్ అలా కనిపిస్తే కడుపు మంట సహజం!

Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల వివాదాలు చూస్తే మాత్రం నవ్వు పుట్టిస్తాయి. మంత్రి నారా లోకేష్ విషయంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అలానే ఉంటాయి. ఆయన ఎలా ఉన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన శరీర ఆకృతి పై మాట్లాడారు. ఆయన భాష పై, ఆయన చర్యలపై చాలా రకాల కామెంట్స్ చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అయితే వారి మాటలు లోకేష్ లో కసిపించాయో.. లేకుంటే తనను తాను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆయన భావించారో తెలియదు కానీ.. నారా లోకేష్ పూర్తి తన స్టైల్ ను మార్చేశారు. స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. భాష మారింది. ఆహార్యం మారింది. మొత్తం వ్యవహారమే మారిపోయింది. అయితే మారిన లోకేష్ ను చూసి పశ్చాత్తాప పడాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంగారు పడిపోతోంది. మళ్లీ లేనిపోని ప్రచారం చేస్తోంది కానీ.. ఆ ప్రచారం తేలిపోతుంది.

Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!

* ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు హాజరు..
నిన్ననే టి20 వరల్డ్ కప్( T20 World Cup) ఫైనల్ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్తో తలపడిన ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నా.. భారత్ తలపడే కీలక మ్యాచ్లు అయితే అక్కడ వాలిపోతున్నారు మంత్రి నారా లోకేష్. నిన్న కూడా ఇండియా జట్టు జెర్సీతో.. అచ్చం క్రికెట్ క్రీడాకారుడు మాదిరిగా లోకేష్ లుక్ కొత్తగా ఉంది. మ్యాచ్ కు హాజరైన లోకేష్ పనిలో పనిగా క్రికెట్ దిగ్గజాలతో కలిశారు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో పలు విషయాలు చర్చించారు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కలిశారు. ఐసీసీ అధ్యక్షుడు జై షా తో చర్చించారు కూడా. అయితే మరోవైపు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సందడి చేశారు లోకేష్. సాధారణ ప్రేక్షకుడి మాదిరిగా స్టేడియం ప్రాంగణంలో ఈలలతో గోలలతో సందడి లోకేష్. అయితే టిడిపి శ్రేణులు ఈ వీడియోలను వైరల్ చేసుకున్నాయి. కానీ ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడని విషయం.

* బయట పెట్టేసిన జగన్..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ లోకేష్ విషయంలో చేయని ప్రచారం అంటూ లేదు. కానీ ఇప్పుడు లోకేష్ ను చూస్తుంటే ఆ పార్టీ శ్రేణులకు నిజంగా కడుపు మంట. అందుకే ఆ మధ్యన బయట పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఖర్చులతో క్రికెట్ మ్యాచ్లు చూడడం ఏంటని.. ఇంట్లో టీవీలో వస్తుంది కదా అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా తనలో ఉన్న కడుపు మంటను బయటపెట్టారు. అయితే లోకేష్ క్రికెట్ మ్యాచ్ లు వీక్షించేందుకు ఎక్కడా ప్రభుత్వం తరఫున ఖర్చు చేయడం లేదని.. సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఏమైనా సరే లోకేష్ అలా కనిపిస్తుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడని విషయమే. అయితే లోకేష్ న్యూ లుక్ చూసి మాత్రం యువత బాగానే కనెక్ట్ అవుతున్నారు. నెటిజెన్లు ఆయనను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version