Homeఎంటర్టైన్మెంట్Actress Habah Patel: ఆ రెండు సినిమాల పైనే ఆశలు పెట్టుకున్న హెబ్బా పటేల్...

Actress Habah Patel: ఆ రెండు సినిమాల పైనే ఆశలు పెట్టుకున్న హెబ్బా పటేల్…

Actress Habah Patel: ‘కుమారి 21ఎఫ్’ మూవీతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. ఈ సినిమాలో ఓవైపు గ్లామర్‌తో పాటు మరోవైపు తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుందీ బ్యూటీ. నిజానికి ఈ సినిమా కంటే ముందే వచ్చిన ‘అలా ఎలా’ సినిమాతో తెలుగులో కనిపించినప్పటికీ ఈ సినిమా పెద్దగా హెబ్బాకు గుర్తింపు తీసుకురాలేదు. కుమారోయి 21 ఎఫ్ సినిమా సూపర్ హిట్ అవడంతో కుర్ర హీరోలకు మంచి ఛాయిస్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు.

actress hebah patel hopes on her upcoming two films for her film career

కానీ, కుమారి 21ఎఫ్ లాంటి సాలీడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఆ తర్వాత అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆఖరికి ’24 కిసెస్’ అంటూ ముద్దులతో రెచ్చిపోయింది కూడా. కానీ, ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. రామ్ పోతినేని డ్యూయల్ రోల్‌లో నటించిన ‘రెడ్’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో మెరిసింది హెబ్బా పటేల్. ఇది కూడా పెద్దగా కలిసి రాలేదు. టాలెంట్ పరంగా హెబ్బాను కామెంట్ చేయడానికి లేదు. అయితే, సరైన హిట్టే పడడం లేదు. మళ్ళీ ‘కుమారి 21ఎఫ్’ లాంటి సాలీడ్ హిట్ పడితే లైన్‌లోకి వచ్చేస్తుంది.

ఇక హెబ్బా పటేల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’, ‘తెలిసిన వాళ్లు’ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం. ఇక ఇటీవల ‘తెలిసిన వాళ్లు’ చిత్ర యూనిట్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. విప్లవ్‌ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెండ్‌గా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలతో హెబ్బా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version