Raj Kumar: ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. పదునైన కత్తులతో సై*కో మాదిరిగా వీరంగం చేశాడు. అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.. రాక్షసుడి మాదిరిగా వ్యవహరించాడు. నమ్మి వచ్చిన భార్యను.. కన్న కొడుకులను అత్యంత దారుణంగా హతమార్చాడు. బాలికను.. ఆమె తల్లి.. నానమ్మను పైశాచికంగా చంపేశాడు. ఇంతటి క్రూరానికి పాల్పడిన ఆ దుర్మార్గుడు చివరికి కుక్క చావు చచ్చాడు. గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడ ప్రాంతంలో సై*కో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. కేవలం స్వల్ప కాలంలోనే అతడు ఆరుగురిని చంపేశాడు. ఆ తర్వాత పరారీ అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత విరమించుకున్నాడు. పోలీసులు ఒత్తిడి తీసుకురావడం.. గాలింపు ముమ్మరం చేయడంతో తట్టుకోలేకపోయాడు. తనమీద పాజిటివ్ ఒపీనియన్ కోసం సూ*సై*డ్ లెటర్ కూడా రాశాడు. ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత గడ్డి మందు తాగి.. తన మేనమా ఊరిలో పొలాల దగ్గర చనిపోయాడు.
రాజ్ కుమార్ మరణించాడని స్థానికులు డయల్ 100 కు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని స్వీకరించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మృతదేహం అంబులెన్స్ లో ఉండగా.. చూసి వెను తిరిగి వెళ్ళిపోయారు. చేవెళ్ల పురపాలక సిబ్బంది సహకారంతో స్థానికంగా ఉన్న స్మశాన వాటికలో రాజ్ కుమార్ మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
రాజ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో దాదాపు మూడు గంటల వరకు జాప్యం ఏర్పడింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ పోస్టుమార్టం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో వికారాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి వైద్యులను రప్పించడానికి ప్రయత్నం చేశారు. అవి విఫలం కావడంతో.. చివరికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి.. డాక్టర్ ప్రణీత్ వచ్చి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేశారు.
షాబాద్ ఆరుగురి హత్యల కేసు నిందితుడి అంత్యక్రియలు పూర్తి
నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన కుటుంబసభ్యులు.
చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు.
బాధిత దివ్యాంగ బాలికకు ₹10 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు… pic.twitter.com/4F5LxVT2Hz
— Telugu Stride (@TeluguStride) July 14, 2026
