Homeజాతీయ వార్తలుMaharashtra Floods: పుష్ప సినిమా రిపీట్.. ఏం ఫీల్ వచ్చింది మామ.. వైరల్ వీడియో

Maharashtra Floods: పుష్ప సినిమా రిపీట్.. ఏం ఫీల్ వచ్చింది మామ.. వైరల్ వీడియో

Maharashtra Floods: పుష్ప సినిమా చూశారా.. అందులో అల్లు అర్జున్ ఎర్రచందనం దుంగలను పోలీసుల నుంచి కాపాడేందుకు ఏకంగా నీటిలో వేస్తాడు. నీటి ప్రవాహానికి అవి కొట్టుకొని వస్తాయి. ఆ తర్వాత అత్యంత జాగ్రత్తగా వాటిని బయటికి తీస్తాడు. ఆ తర్వాత దొంగ మార్గంలో వేరే ప్రాంతంలోకి పంపిస్తాడు. చూసేందుకు ఆ సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఎర్రచందనం కర్రలను ఇలా దొంగలించడం.. అలా జాగ్రత్తగా దాయడం అంత ఈజీనా.. చివరికి నీటిలో కూడా వాటిని వేసి ఇలా కాపాడుకుంటారా అని అప్పట్లో ఒక చర్చ కూడా సాగింది. అదంతా సినిమా కాబట్టి.. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది కాబట్టి.. అలా చేశారు. కానీ రియల్ లైఫ్ లో అలా సాధ్యమవుతుందా..

మహారాష్ట్రలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తాకిడికి నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని రాయ్ గడ్ ప్రాంతంలో పాతాళ గంగ నది కొద్దిరోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని దాటి ఆ నదిలో నీటి ప్రవాహం ఉంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచిన కేంద్రాన్ని ముంచెత్తింది. నీటి ప్రవాహానికి ఆ కేంద్రంలో ఉన్న సిలిండర్లు మొత్తం బయటికి వచ్చాయి. ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చూస్తుంటే ఆ సన్నివేశం అచ్చం పుష్ప సినిమాను తలపించింది. నీటి ప్రవాహంలో గ్యాస్ సిలిండర్లు వెళ్తున్న తీరు చూసేవాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పుష్ప సినిమాలో నీటి ప్రవాహంలో ఎర్రచందనం దుంగలు ప్రవహించినట్టుగానే.. గ్యాస్ సిలిండర్లు కూడా ఒకదాని వెంట ఒకటి నీటిలో వెళ్లాయి. దాదాపు 3,000 సిలిండర్లు ఇలా నీటిలో కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఈ ప్రవాహ దృశ్యాన్ని కొంతమంది తమ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలోకి పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. వాస్తవానికి పుష్ప సినిమా మాదిరిగా ఇటువంటి సన్నివేశం నిజ జీవితంలో చోటు చేసుకుంది అంటే మాటలు కాదని.. ఈ వీడియో సుకుమార్ చూసి ఉంటే మరింత సంతోషిస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular