Ravana: రామాయణం నిజమైతే అద్భుతం.. అబద్దమైతే మహాద్భుతమని ఓ కవి అన్నారు. ఇతిహాసాల్లో రామాయాణానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలుగా నాలుగు భాగాలుగా గుర్తిస్తారు. రామాయణం కృతా యుగంలో జరిగిందని చెబుతారు. అంతటి చరిత్ర కలిగిన రామాయణంలో ప్రతీ ఘట్టం ఓ అద్భతమే. ప్రతి సన్నివేశం ఓ సుందర కావ్యమే. ఇందులో రాముడు, రావణుడు కథానాయకుడు, ప్రతినాయకులుగా మనకు తెలుసు. శ్రీరాముడి కంటే రావణుడికే ఎక్కువ శక్తి ఉన్నట్లు చెబుతారు. అతడి మేథస్సుకు అందరు ఫిదా అయ్యే వారట.

ఇక్కడ మనకు రావణుడు గురించే చెప్పుకోవడం సందర్భోచితం. రావణుడి నివాసం లంక. రాముడి ఆవాసం అయోధ్య. భారత్, శ్రీలంక మధ్య సముద్రం ఉండటంతో రాముడు వంతెన నిర్మించాడని రామాయణంలో చదువుకున్నాం. కానీ రావణుడు తన హయాంలోనే విమానం వాడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో దాని గురించి పరిశోధించేందుకు శాస్ర్తవేత్తల బృందం కూడా తయారయింది. దీనికి శ్రీలంకతో భారత్ కూడా అందులో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేసింది.
అయితే పరిశోధన ప్రారంభం అయ్యే నాటికి కరోనా తీవ్రమైన నేపథ్యంలో మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం కరోనాకు టీకాలు రావడంతో వైరస్ తగ్గుముఖం పట్టడంతో పరిశోధన మళ్లీ కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై అందరిలో ఆసక్తి కూడా పెరుగుతోంది. ఎందుకంటే రావణుడు నిజంగానే విమానం ఉఫయోగించాడా? అనే దానిపైనే అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు
ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంత? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం 5 మిలియన్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. రావణుడే మొట్టమొదటిసారి విమానాన్ని వాడినట్లు వస్తున్న వార్తలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రెండేళ్ల కిందటే పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, శాస్ర్తవేత్తలు, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read: Jagan Pawan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. దెబ్బకు ‘రోడ్డు’పై పడ్డ జగన్
అయితే లాక్ డౌన్ పరిణామాలతో పరిశోధనకు తాత్కాలిక విరామం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది పరిశోధన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తోంది. ఇదే జరిగితే రావణుడి విమానం వాడకం గురించి గుట్టు రట్టయి మనకు కూడా ఓ అవగాహన కలగనుంది. దీని కోసం ఇండియా, శ్రీలంక ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TS Politics TRS vs BJP: తెలంగాణ లో రాజకీయాలు బీజేపీ vs టీఆర్ఎస్