Nayeem Diaries: గత కొన్ని సంవత్సరాల క్రితం పోలీసులని, రాజకీయ నాయకులందరినీ హడలెత్తించిన గ్యాంగ్‌స్టర్ నయీం గురించి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. తెలంగాణలో మావోయిస్టు లీడర్ గా, ఆ తర్వాత క్రిమినల్ గా, ఆ తర్వాత చోటా డాన్ గా మారుతూ మోసాలు చేస్తూ ఎదిగాడు నయీం. కాగా 2016లో పోలీసుల ఎన్ కౌంటర్ లో నయీం మరణించాడు. ఆ తర్వాత నుంచి అతనిపై, అతని అనుచరుల గురించి ఏదో ఒక వార్తను వింటూనే ఉంటున్నాం. కాగా ఇటీవల అతని బినామీ ఆస్తుల గురించి కూడా వార్తల్లో హాట్ టాపిక్ నడుస్తుంది.

అయితే గతంలో గ్యాంగ్‌స్టర్ నయీంపై సినిమాలొచ్చాయి. గ్యాంగ్‌స్టర్ నయీంపై సినిమా చేస్తామని చాలా మంది ప్రకటించారు. కాగా తాజాగా గ్యాంగ్‌స్టర్ నయీంపై మరో బయోపిక్ రానుంది. గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘నయీం డైరీస్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. వశిష్ఠసింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు. కల్పిత కథాంశాలతో పోలిస్తే బయోపిక్‌లు ప్రేక్షకుల్లో ఎక్కువగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఈ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది అని సంపత్ నంది అన్నారు.
నక్సలైట్‌గా మొదలైన నయీం జీవితంలో ఏం జరిగిందనేది సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం అని దర్శకుడు బాలాజి అన్నారు. ఏడు సంవత్సరాలు జైలులో ఉన్న అతడు పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా, క్రిమినల్‌గా ఎలా మారాడో చూపిస్తున్నాం అని తెలిపారు.