https://oktelugu.com/

14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం పొందే అవకాశం.. ఏం చేయాలంటే?

ప్రస్తుత కాలంలో రోజుకు 8 గంటలు పని చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ జీతం లభిస్తూ తక్కువ పని గంటలు ఉండే ఉద్యోగాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒక వింత ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 9 లక్షల రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2021 / 10:47 AM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో రోజుకు 8 గంటలు పని చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ జీతం లభిస్తూ తక్కువ పని గంటలు ఉండే ఉద్యోగాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒక వింత ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 9 లక్షల రూపాయల వేతనం లభించనుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వ్యక్తులు డిసెంబర్ నెల 22వ తేదీ నుంచి జనవరి నెల 5వ తేదీ వరకు పని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పని చేసిన వాళ్లకు 14 రోజులకు 9 లక్షల రూపాయల వేతనం పొందడానికి అర్హులని చెప్పవచ్చు. అయితే ఈ ఉద్యోగం చేసే 14రోజుల పాటు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లకూడదనే నిబంధన ఉంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌ కు చెందిన ఒక ధనిక కుటుంబం వ్యాపార పనుల నిమిత్తం బయటి దేశాలకు వెళుతూ పిల్లలను మాత్రం ఇంటికే పరిమితం చేశారు. డిసెంబర్ లో క్రిస్మస్ పండుగ ఉండగా 14 రోజుల పాటు పిల్లలను చూసుకునే కేర్ టేకర్ కు రోజుకు 59,000 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి కిస్మస్ వేడుకను ఆ కుటుంబానికి చెందిన పిల్లలతోనే జరుపుకోవాలి.

    కేర్ టేకర్ పిల్లల స్నానంతో పాటు తిండి ఇతర బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీకి ఎంపికవుతారో ఆ వ్యక్తికి సంబంధించిన ప్రయాణ ఖర్చులను యజమాని భరిస్తారు.