Pawan Kalyan Criminal Case: జనసేన పార్టీ అధినేత , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై తమిళ నాడు లోని అన్నా నగర్ పోలీసులు సెక్షన్స్ 196(1)(a),299 ,302 మరియు 353 (1)(a)(b) క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఘటన సంచలనంగా మారింది. రీసెంట్ గానే చెన్నై లో జరిగిన మురుగన్ మనాడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉపన్యాసం తమిళనాడు ప్రాంతంలో ప్రకంపనలు రేపింది. ఏకంగా అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ ప్రసంగం పై కామెంట్స్ చేశారు. ఇప్పటికీ కూడా అయన ప్రసంగం పై ప్రముఖ తమిళ టీవీ చానెల్స్ లో డిబేట్స్ జరుగుతున్నాయి. తమిళ హీరో విజయ్ పార్టీ పెట్టి ఇన్ని ప్రసంగాలు ఇచ్చినా రానటువంటి రీచ్ పవన్ కళ్యాణ్ ప్రసంగానికి రావడం అక్కడి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకు కేసు ఏమిటంటే పవన్ కళ్యాణ్, అన్నామలై కలిసి భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లఘించారని, మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిమ్చారు FIR లో పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అధికారం లోకి వచ్చిన తర్వాత చాలా కొత్తగా కనిపిస్తున్నాడని, ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం పై తెగ ఉపన్యాసాలను ఇస్తూ బీజేపీ స్టాండ్ ని తన భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్తున్నాడని, ఇది కచ్చితంగా ఆయనకు భవిష్యత్తులో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియా లో పలువురు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. కులం లేదు,మతం లేదు అని చెప్పుకుంటూ జనసేన పార్టీ ని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మతం పేరు లేనిదే రాజకీయం చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు.
దీనిపై జనసేన పార్టీ శ్రేణులు కూడా చాలా ధీటైన సమాధానం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుండి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉన్నాడని,ఇప్పుడు హిందూ మతం అనేక సందర్భాల కారణంగా అబాసుపాలయ్యే ప్రమాదం ఉండడం,కొంతమంది మతోన్మాదులు హిందువుల అస్తిత్వం ని అవమానించే క్రమం లో పవన్ కళ్యాణ్ హిందువుల తరుపున నిలబడి పోరాడుతున్నాడని, హిందువులకు సపోర్ట్ గా మాట్లాడితే మతోన్మాది లాగా చిత్రీకరిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఇస్లాం మతం చెందిన మస్జీద్ లకు, క్రిస్టియన్ మతానికి చెందిన చర్చులకు పవన్ కళ్యాణ్ ఇది వరకు ఎన్నో డొనేషన్స్ చేసాడని, ఆయనకు అందరూ సమానమే అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. మరి పవన్ కళ్యాణ్ పై తమిళనాడు లో నమోదైన ఈ క్రిమినల్ కేసు కారణంగా ఆయన భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులను ఎదురుకోబోతున్నాడా లేదా అనేది చూడాలి.