Today 2nd July Horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశుల పై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండగా ఉంది.. వ్యాపారులు బిజీగా ఉంటారు. మేషం తో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో పెద్ద సలహా తీసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరుల వద్ద భాగ్యలు ఉంటే వెంటనే వసూలు చేసుకోవాలి. లేకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈరోజు వారు ఈరోజు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యం సంప్రదించడం మంచిది. అనుకోకుండా ఇంటికి అతిధులు వస్తారు. నీతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వారు పూర్వీకుల ఆర్థిక సంబంధించిన శుభవార్తలు వింటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారాల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల కోసం సమయానికి కేటాయిస్తారు. ఇంటికి అవసరమైన నిర్మాణ వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కర్కాట రాజు వారి జీవితం ఈరోజు ఆళ్లదంగా ఉంటుంది. అయితే వ్యాపారులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరగదు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తిచేస్తారు. కానీ కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వాతావరణం లో మార్పులు కారణంగా అనారోగ్యాల పాలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఆహారంపై దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విద్యార్థులు ఇతరులతో పోటీపడి పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటికి సంబంధించిన విషయాలను కొత్త వ్యక్తులతో పంచుకోవద్దు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండకపోవచ్చు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. గతంలో ఎవరికైనా డబ్బు ఇస్తే దానిని తిరిగి పొందుతారు. కుటుంబంలో ఉన్న సమస్యల గురించి నిర్లక్ష్యంగా ఉండొద్దు. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే పెద్దదిగా మారి ఇబ్బందులను సృష్టిస్తాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు వారు ఈరోజు అనేక విషయాల్లో ముందుంటారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో కలిసి వ్యాపారం చేయడం వల్ల లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. కుటుంబంలో కొన్నిచికాకులు ఉండొచ్చు. అయితే వీటిని వెంటనే పరిష్కరించుకుంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ధనస్సు రాశి వారికి చట్టపరమైన చెక్కులు ఉంటే తొలగిపోతాయి. నిత్యవసర వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు వ్యాపారులు ప్రణాళికలు వేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈరోజు వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్తగా ఆర్తి ఒప్పందం చేసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే ఈ విషయంలో కాస్త తెలివిగా ప్రవర్తించాలి. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. కొన్ని సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు వ్యాపారులకు సాయంత్రం అనుకోకుండా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఊహించని విధంగా కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకోకుండా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది.