Media politics : ఆ మీడియా అధినేత తన సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానంలో ఎదుటి వాళ్ల వ్యవహారాలను బయటకు లాగి డబ్బులు సంపాదించాడు. వారి అంతర్గత వ్యవహారాలను తెలుసుకొని.. వాటికి అనుగుణంగా వార్తలు రాసి భారీగా దండుకున్నాడు. ఆ వ్యవహార శైలిని అతడు ఇప్పటికీ మార్చుకోలేదు. మార్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పుట్టిన నాటి బుద్ధి పుడుకల్తో కూడా పోదని ఒక సామెత. ఆ సామెతను ఆ మీడియా అధినేత నిజం చూసి చూపిస్తున్నాడు.. ఒకప్పుడు అతి సాధారణమైన జీవితం గడిపిన ఆ మీడియా అధినేత ఇప్పుడు వేలకోట్లకు ఎదిగాడు. పైగా ప్రస్తుతం అతడికి రెండు రాష్ట్రాలలో అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. దీంతో అతని ఆనందానికి అవధులు లేవు. అడ్డగోలు సంపాదనను అడ్డుకునే వారు లేరు.
డబ్బు ఎక్కువైతే వివాదాలు ఆటోమేటిక్ గా వస్తుంటాయి. దీనికి ఆ మీడియా అధినేత కుటుంబం మినహాయింపు కాదు.. డబ్బులు వివిధ మార్గాల ద్వారా విపరీతంగా వస్తున్న నేపథ్యంలో ఆ మీడియా అధినేత గతానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టాడు. అయితే తనకున్న పత్రికను కుమారుడికి.. ఛానల్ ను కుమార్తెకు కేటాయిస్తూ గతంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు.. అయితే కూతురి భర్త పెత్తనం ఇటీవల కాలంలో ఛానల్లో ఎక్కువైందని తెలుస్తోంది. పైగా చానల్లో ఆ మీడియా అధినేతకు అత్యంత దగ్గర ఉన్న వ్యక్తులను అల్లుడు వేధిస్తున్నట్టు ఇటీవల కాలంలో ఆయనకు చాలామంది చెప్పారు. దీంతో ఆ మీడియా అధినేతకు ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి నెలకొంది. పైగా అల్లుడిని పిలిచి మందలిస్తే కూతురు ఏమైనా అనుకుంటుందేమోనని.. ఆ మీడియా అధినేత తనలో తాను మదనపడటం మొదలుపెట్టాడు. అయితే ఇటీవల ఆ ఛానల్ లో పనిచేసే ఓ కీలక ఉద్యోగి ఆ మీడియా అధినేతను కలిశాడు. అల్లుడి ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నాడు. దీంతో ఆ మీడియా అధినేతకు ఒక ఆలోచన వచ్చింది..
“మిమ్మల్ని మా అల్లుడు పెడుతున్న ఇబ్బందులు నా దృష్టికి చాలామంది తీసుకువచ్చారు. ఇప్పుడు మీరు కూడా చెబుతున్నారు. ఇలాంటి వ్యవహారం మంచిది కాదు. ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్వేచ్ఛ ఉండాలి. ఉద్యోగులతో పని చేయించుకోవాలి. అంతే తప్ప బాసిజం ప్రదర్శిస్తే కుదరదు. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాకు ఒక ఫిర్యాదు చేయండి. దానిని ఒక లేఖ రూపంలో రాయండి. ఈ కాపీని అతడి ముందు ఉంచుతాను. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటానని” మీడియా అధినేత వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా ఆ కీలక ఉద్యోగి షాక్ తిన్నాడు. అల్లుడు మీద చర్యలు తీసుకోవడానికి ఈ లేఖలు అడ్డు పెట్టుకోవడం ఏంటని అతడు తన తోటి ఉద్యోగులతో వ్యాఖ్యానించాడు.
అయితే తన అల్లుడికి వ్యతిరేకంగా లేఖ రాయమని.. ఆ లేఖలో పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావించమని ఆ మీడియా అధినేత ఊరికే అనలేదు. దాని వెనక చాలా లోతైన విషయం దాగుంది. కొంతకాలంగా ఆ మీడియా అధిపతి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తుల విషయంలో మనస్పర్ధలు చోటు చేసుకుంటున్న. ఈ నేపథ్యంలో పత్రికలో వాటా కోసం అల్లుడు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అనేక పర్యాయాలు ఆ మీడియా అధినేత వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లుడి దూకుడుకు ముకుతాడు వెయ్యాలని ఆ మీడియా అధినేత నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందువల్లే సంస్థలో పనిచేస్తున్న కీలక ఉద్యోగితో ఆరోపణలతో కూడిన ఫిర్యాదును చేయించినట్టు తెలుస్తోంది. ఈ లేఖను ముందు పెట్టి అల్లుడికి లెఫ్ట్ రైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
కీలక ఉద్యోగి చేసిన కంప్లైంట్ లెటర్ అల్లుడు ముందు పెట్టి గొడవను తాత్కాలికంగా ఆ మీడియా అధినేత నిలిపివేశాడు. ఆస్తుల పంచాయతీని ఆపివేశాడు.. అల్లుడు దూకుడుకు బ్రేక్ వేశాడు. అయితే ఇదంతా తాత్కాలికమే. ఎందుకంటే ఆ మీడియా అధినేత అల్లుడు మామూలోడు కాదు.. అతని వ్యవహార శైలి ఆ మీడియా అధినేతకు మించి ఉంటుంది. బహుశా అందువల్లేనేమో ఆ మీడియా అధినేత తెగ భయపడిపోతున్నాడు. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని.. వారి అంతర్గత విషయాలను ప్రచురించి పండగ చేసుకున్న ఆ మీడియా అధినేతకు అల్లుడు ఒక రేంజ్ లో గుణ పాఠం చెబుతున్నాడు. దీనినే కర్మ ఫలితం అంటారేమో..