Homeటాప్ స్టోరీస్Jio 51 5G offer: తక్కువ ధరతో అపరిమిత 5G డేటా ఎలా పొందాలంటే..

Jio 51 5G offer: తక్కువ ధరతో అపరిమిత 5G డేటా ఎలా పొందాలంటే..

Jio 51 5G offer: జియో వచ్చిన తర్వాత మన దేశంలో టెలికాం విప్లవం మొదలైంది.. తక్కువ ధరలో డాటా అందించడంలో జియో మొదలుపెట్టిన టెలికాం ఉద్యమం ఆ తర్వాత అనేక రకాల మార్పులకు దారి తీసింది. ప్రస్తుతం చార్జీలు పెంచినప్పటికీ.. ఇతర దేశాలతో పోటీ చూస్తే డాటా వినియోగంలో మన దేశం మెరుగ్గానే ఉన్నప్పటికీ.. చార్జీలు తక్కువే అని చెప్పాలి. తాజాగా జియో 5 జి డాటా విషయంలో ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా 51 […]

Jio 51 5G offer: జియో వచ్చిన తర్వాత మన దేశంలో టెలికాం విప్లవం మొదలైంది.. తక్కువ ధరలో డాటా అందించడంలో జియో మొదలుపెట్టిన టెలికాం ఉద్యమం ఆ తర్వాత అనేక రకాల మార్పులకు దారి తీసింది. ప్రస్తుతం చార్జీలు పెంచినప్పటికీ.. ఇతర దేశాలతో పోటీ చూస్తే డాటా వినియోగంలో మన దేశం మెరుగ్గానే ఉన్నప్పటికీ.. చార్జీలు తక్కువే అని చెప్పాలి.

తాజాగా జియో 5 జి డాటా విషయంలో ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా 51 రూపాయల రీఛార్జి తో అపరిమితమైన డాటాను అందించే అవకాశాన్ని కష్టమర్లకు తీసుకొచ్చింది. రిలయన్స్ అందిస్తున్న 51 ట్రూ అన్లిమిటెడ్ 5 జీ అప్ గ్రేడ్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్. సాధారణంగా రోజుకు 2gb కంటే తక్కువ డేటా (ఉదాహరణకు 1.5జిబి/ రోజుకు) ఇచ్చే ప్లాన్లలో 5జి డేటా ఉచితంగా లభించదు. అటువంటి యూజర్లు 51 యాడ్ ఆన్ ప్యాక్ ద్వారా అపరిమితమైన డేటాను సొంతం చేసుకోవచ్చు.

51 ప్లాన్ వివరాలు ఎలా ఉన్నాయి అంటే

అన్లిమిటెడ్ 5జి డేటా: ఈ ప్యాక్ ఆక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు అపరిమితంగా 5 జీ డేటా వాడుకోవచ్చు.

అదనపు 4జి డేటా: ఒకవేళ మీ ప్రాంతంలో 5g నెట్వర్క్ కనక లేకపోతే.. డాటా ను ఉపయోగించుకోవడానికి ఈ ప్లాన్ తో పాటు 3gb 4g డేటా కూడా వస్తుంది.

వ్యాలిడిటీ.. దీనికోసం ప్రత్యేకంగా వ్యాలిడిటీ అంటూ ఉండదు. మీ ప్రస్తుత ఆక్టివ్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో.. ఇది కూడా అంతవరకు పనిచేస్తుంది.

ఈ ఆఫర్ పొందడానికి ఏం చేయాలంటే..

బేస్ ప్లాన్ వ్యాలిడిటీ.. ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్ (ఉదాహరణకు రోజుకు 1.5జిబి డేటా ఇచ్చే ప్లాన్) వ్యాలిడిటీ గరిష్టంగా ఒక నెల (28 రోజులు) ఉండాలి. ఒకవేళ మీ బేస్ ప్లాన్ వ్యాలిడిటీ రెండు నెలలు గనుక ఉంటే 101 ప్లాన్, మూడు నెలలు గనుక ఉంటే 151 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

5 జీ స్మార్ట్ ఫోన్: ఈ డేటా మీరు వాడుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీ వద్ద 5 జీ సపోర్ట్ చేసే మొబైల్ ఉండాలి.

జియో 5 జీ నెట్వర్క్: మీ ప్రాంతంలో జియో ట్రూ 5 జీ నెట్వర్క్ అందుబాటులో ఉండాలి.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే..

సులభంగా మీరు ఈ కింది పద్ధతుల ద్వారా యాడ్ ఆన్ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మొదటి స్టెప్: మీ మొబైల్లో మై జియో యాప్ ఓపెన్ చేయాలి. లేదా జియో అధికారిక వెబ్సైట్ లో ప్రయత్నించాలి.

రెండవ స్టెప్: రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్ళాలి. అందులో ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ లేదా డాటా బూస్టర్ కేటగిరీని ఎంచుకోవాలి.

మూడవ స్టెప్: అక్కడ కనిపించే 51 ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేయాలి.

నాలుగవ స్టెప్: రీఛార్జ్ విజయవంతం అయిన తర్వాత మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి.

ఐదవ స్టెప్: mobile network – preferred network type లో 5G(auto) ఆప్షన్ ఎంచుకోవాలి.

ఫలితంగా మీ ఫోన్ jio 5g నెట్వర్క్ కు కనెక్ట్ అవుతుంది. ఎటువంటి పరిమిత లేకుండానే హై స్పీడ్ అన్లిమిటెడ్ 5జి డేటాను ఆనందించవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper