Site icon OkTelugu

Dalai Lama Epstein Files: దలైలామా కూడా ఆటగాడేనా.. ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో ఇంకా ఎన్ని సంచలనాలు చూడాలో?

Dalai Lama Epstein Files

Dalai Lama Epstein Files

Dalai Lama Epstein Files: భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. గొప్ప వ్యక్తుల నీలి లీలలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు.. ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని పొందే వ్యక్తులు.. ప్రపంచ అధినేతలుగా ఉన్న వ్యక్తులు.. ఇలా అందరూ కూడా ఈ భాగోతంలో ఉన్నారు. కాకపోతే పేర్లు వచ్చినప్పుడు మాత్రమే వారంతా భుజాలు తడుముకుంటున్నారు.

అమెరికాలో జరిగిన ఎఫ్ స్టీన్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బిల్ గేట్స్, ట్రంప్.. ఇంకా చాలామంది వ్యక్తులు ఈ నీలి వ్యవహారంలో ఉన్నట్టు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇష్టానుసారంగా అనైతికమైన పనులకు పాల్పడ్డారు. ఆ క్రమంలో ఆయనకు సుఖ వ్యాధులు సోకాయి. దీంతో తన వ్యాధిని దాచిపెట్టి భార్య మిలిందాకు అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. చివరికి ఈ వ్యవహారం తెలియడంతో మిలిందా అతడి నుంచి దూరం జరిగింది. ఇప్పుడు బిల్గేట్స్ వ్యవహారం బయటపడడంతో.. అతడి మీద ఇప్పటివరకు జానం పెట్టుకున్న నమ్మకాలు మాయమవుతున్నాయి.

బిల్ గేట్స్ వ్యాపారి కాబట్టి కక్కుర్తి పడి అలా చేశాడు అనుకోవచ్చు. ట్రంప్ స్త్రీ లోలుడు కాబట్టి ఆవేశపడ్డాడు అనుకోవచ్చు. కానీ ఈ ఫైల్స్ లో బౌద్ధ గురువు దలైలామా పేరు వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏకంగా ఆయన పేరును 169 సార్లు ఎఫ్ స్టీన్ ప్రస్తావించడం కలవరానికి గురి చేస్తోంది. దలైలామా బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తున్నారు. టిబెట్ ను చైనా ఆక్రమించడాన్ని నిరసిస్తూ ఆయన కొంత కాలంగా చైనా తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పేరు ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో రావడంతో చర్చ మొదలైంది…

ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో దలైలామా పేరు రావడంతో ఆయన కార్యాలయం స్పందించింది.. ” ఎఫ్ స్టీన్ ఫైల్స్ తో దలైలామాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యక్తిత్వ గౌరవానికి భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధానం సరైనది కాదు. ఆయన ఎన్నడు కూడా ఎఫ్ స్టీన్ ను కలవలేదు. ఏ విషయం గురించి కూడా చర్చించలేదు. ఆయన ప్రస్తావన కూడా దలైలామా తీసుకురాలేదు. అనవసరంగా ఈ వివాదాల్లోకి ఆయనను లాగి ఇబ్బందికి గురి చేయకూడదని” దలైలామా కార్యాలయం పేర్కొంది.

మరోవైపు ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ స్థాయిలో పేర్లు బయటికి వస్తున్న క్రమంలో ఆ పెద్ద వ్యక్తులు ఏ స్థాయిలో అకృత్యాలకు పాల్పడ్డారోనని ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే పెద్ద వ్యక్తులు మొత్తం ఇటువంటి చీకటి పనులు చేశారని.. ఇన్నాళ్లకు వారి అసలు నీలి వ్యవహారం బయటపడుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Exit mobile version