Pawan Kalyan: ఈరోజుల్లో ఎన్నికల్లో గెలవడం అంటే ఆషామాషీ కాదు. వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు.. ఎన్నికలేవైనా ఖర్చు మోపెడవుతోంది. ఒకప్పుడు వ్యక్తికి మంచి పేరు, హోదా ఉంటే అభ్యర్థిగా అనుకొని ఎన్నికల్లో నిలబెట్టేవారు. ఆ వ్యక్తిపై ఉన్న అభిమానంతో నియోజకవర్గ ప్రజలు గెలిపించుకునేవారు. కానీ ఎన్నికల్లో చాలా వరకు డబ్బు ప్రధానం కావడంతో ఎవరికెన్ని డబ్బులుంటే వారే గెలుస్తారు..! కార్యకర్తలకు భోజనం ఖర్చు నుంచి ర్యాలీల వరకు కోట్లు ఖర్చుపెట్టనిదే ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ధనం లేని వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించగలడా..? ప్రజాభిమానంతో పదవులను దక్కించుకోగలరా..? అనే ప్రశ్న ఎదురవుతోంది.
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డ ఈటల రాజేందర్ ను ఓడించాలని కేసీఆర్ వేయని స్కెచ్ లేదు. ఈటల గెలిస్తే టీఆర్ఎస్ లో మరిన్ని తిరుగుబాట్లు వస్తాయని హుజూరాబాద్ లో వందల కోట్లు కుమ్మరించారు. ఏకంగా ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకూ పంచిపెట్టారు. ఈటలను ఓడించడానికి అధికార టీఆర్ఎస్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అప్పటి వరకు ఆగిపోయిన సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేసింది. దళితులకు రూ.10 లక్షల వరకు సాయం చేసే ‘దళిత బంధు’ స్కీంను ప్రవేశపెట్టింది. కానీ ఈటల రాజేందర్ పై ఉన్న అభిమానంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఎన్ని వేలు ఇచ్చినా తీసుకొని మరీ ఈటలకే జైకొట్టారు. ఆయననే ఎన్నికల్లో గెలిపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు 200 కోట్లకు పైగానే ఖర్చు చేశారని టాక్. అయినా ప్రజలు డబ్బును కాకుండా వ్యక్తికే మొగ్గు చూపారు.
ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా? అనే చర్చ సాగుతోంది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట విచ్చలవిడిగా డబ్బులు పంచుతోంది. పథకాల పేరిట పిల్లల నుంచి రైతుల వకు ఏదో రూపంలో వేల రూపాయలను అందిస్తోంది. కానీ విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో జనసైనికులు వాటిని ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. జగన్ ప్రభత్వంలో ప్రజలు పడుతున్న బాధలేంటో వివరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ ను గెలిపిస్తే ఈ పరిస్థితి ఉండదని ప్రజల్లో భరోసా కలుగుతుంది.
‘అయితే ప్రభుత్వం నడపడం అంటే డబ్బులు పంచడం మాత్రమే కాదు.. వారి అవసరాలు తీర్చాలి..’ అనే నినాదంతో పవన్ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. ప్రస్తుతం పవన్ బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల సమయానికి టీడీపీతో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ అలయన్స్ లో వెళితే పెద్దగా డబ్బు అవసరం ఉండకపోవచ్చు. ఇదే సమయంలో జనసైనికులు పవన్ చేస్తున్న పనులకు ప్రజలు ఆకర్షితువుతున్నారని, డబ్బును చూడకుండా వ్యక్తి ఇమేజ్ తో గెలిపిస్తారని అంటున్నారు. ఈటల రాజేందర్ లా పవన్ ను కూడా గెలిపిస్తారని చెబుతున్నారు. ఈటల రాజేందర్ దాదాపు పదిహేనేళ్ల నుంచి టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆయన పార్టీ నుంచి విడిపోయే వరకు మంత్రిగానే కొనసాగారు. ఈటలకు ఉన్న ఇమేజ్ కంటే ఎక్కువగానే జనసేనాని పవన్ పై ఏపీలో అభిమానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమాల పరంగా పవన్ చిరపరిచితుడు.. ఇక గడిచిన రెండు దఫాలు ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి పవన్ పై ఈటలలాగానే సానుభూతి ఉంది.
వైసీపీ, టీడీపీలకు ఇప్పటికే రాజకీయంగా అపార అనుభవం ఉంది. వారి పాలనను ప్రజలు చూశారు. ఖచ్చితంగా ఈసారి మార్పు కోరుకొని జనసేన వైపు మళ్లుతారని జనసేన భావిస్తోంది. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చుపెట్టినా జనసేననే గెలిపిస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పథకాల పేరిట ప్రజలకు అపారమైన డబ్బును పంచింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. దీంతో కొంతమంది ఈ పార్టీలు పంచుతున్న నగదుకు ఆకర్షితులవుతున్నా.. చాలా మంది డబ్బును కాకుండా వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందుకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను ఉదాహరణగా తీసుకుంటున్నారు. బాబు వస్తే మళ్లీ పాత పథకాలు కొనసాగించే అవకాశం ఉంది. వైసీపీ ఉంటే ఇలాగే ఉచితంగా డబ్బులు పంచి రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అంటున్నారు. ఈ తరుణంలో పవన్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే నాగబాబు లాంటి వాళ్లు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో జగన్ కూడా ఇలాగే అని ఒకసారి అధికారాన్ని దక్కించుకున్నారు. మరి ఇలాంటి సమయంలో పవన్ కూడా ఇదే స్ట్రాటజీతో వెళితే అధికారం సాధ్యమేనని అంుటన్నారు. బీజేపీతో పొత్తుతో వెళ్లినా.. టీడీపీని కలుపుకొని పోయినా.. ఒంటరిగా వెళ్లినా జనసేన డబ్బులు పంచకున్నా ఓట్లు వేస్తారని పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: This time pawan kalyans victory in the ap elections is certain
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com