Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ రావాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan). ఇతర మతాల మాదిరిగా హిందూ మత పరిరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని కూడా కోరారు. ఈ క్రమంలో పవన్ చాలామందికి టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. నటుడు ప్రకాష్ రాజ్ అయితే అదే పనిగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పవన్ వర్సెస్ తమిళనాడు పరిస్థితి మారింది. సనాతన ధర్మ పరిరక్షణ తర్వాత.. జాతీయ భాష హిందీపై పెను దుమారమే రేగింది. కేంద్రం హిందీని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడాన్ని తమిళ నేతలు వ్యతిరేకించారు. దానికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. హిందీ, సాంస్కృతం వద్దనడం ఏమిటని తమిళ నేతలను ప్రశ్నించారు. దీనిపై కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన తమిళ నటుడు విజయ్ సైతం విరుచుకుపడ్డారు పవన్ పై. అదే సమయంలో తమిళ నేతలంతా పవన్ కళ్యాణ్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు పవన్.
Also Read: ముందస్తుగా ఇంటర్ అడ్మిషన్లు.. ప్రైవేట్ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందా?
* జాతీయ అంశాలపై దూకుడు..
ఇటీవల పవన్ కళ్యాణ్( Pawan Kalyan) జాతీయాంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. హిందీ భాష వ్యతిరేకులపై కూడా వ్యాఖ్యానాలు చేశారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీని వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. జాతీయ భాష హిందీ తో పాటు సంస్కృతాన్ని పట్టించుకోని అవసరం లేదని తమిళనాడు వ్యాఖ్యానించడాన్ని సైతం పవన్ కౌంటర్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తమిళనాడు రాజకీయ నేతల నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మ పరిరక్షణ కామెంట్స్ నుంచి తమిళనాడు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ వర్సెస్ తమిళనాడు పరిస్థితి మారింది.
* దక్షిణాది రాష్ట్రాల ఉద్యమం
మరోవైపు జాతీయస్థాయిలో డీ లిమిటేషన్( D limitation) ప్రక్రియపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలతో ఒక ఉద్యమ కార్యాచరణ ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
* హాట్ కామెంట్స్
అయితే దక్షిణాది రాష్ట్రాల( South States) ఐక్యత పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యానాలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల వారు దక్షిణాది ప్రాంతీయ భాషలను గౌరవించాలన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలను సైతం మాట్లాడాలన్నారు. భాషలు వేరైనా భారతదేశం ఒక్కటేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. జాతీయ భాషను గౌరవిస్తూనే.. ప్రాంతీయ భాషలను సైతం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఒకవైపు హిందీ భాష రుద్దడం, ఇంకోవైపు డి లిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.