Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు, తమ అభిమాన హీరో నుండి కొత్త సినిమా విడుదల కోసం దాదాపుగా మూడేళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మధ్యలో బ్రో చిత్రం వచ్చింది కానీ, అందులో ఆయన కేవలం ప్రత్యేక పాత్ర మాత్రమే పోషించాడు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక వేగంగా హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) సినిమాని పూర్తి చేసి థియేటర్స్ లో దించేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ రెగ్యులర్ గా పొలిటికల్ సమీక్షలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల ఆయన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయలేకపోయారు. కేవలం 12 రోజులు మాత్రమే ఆయన షూటింగ్ లో ఎన్నికల తర్వాత పాల్గొన్నాడు. ఇక కేవలం ఆయనకు సంబంధించి నాలుగు రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది.
Also Read : మే9 న విడుదల..ఎట్టకేలకు ‘హరి హర వీరమల్లు’ కి మోక్షం..కనీసం ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?
వచ్చే వారం లో ఆయన డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా షూటింగ్స్ కోసమే ఆయన ఈమధ్య డైలీ వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన వెన్ను నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడు. హైదరాబాద్ లో గత కొద్దిరోజులుగా చికిత్స చేయించుకుంటున్నాడు. ఒక పర్సనల్ డాక్టర్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తోనే ఉంటాడట. ఆయన వర్కౌట్స్ చేసేటపుడు డాక్టర్ ఇచ్చిన సూచనల మేరకే ముందుకు వెళ్తున్నాడట. గత నెల రోజుల నుండి ఆయన ఈ ట్రీట్మెంట్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన దాదాపుగా కోలుకున్నాడు. చాలా వరకు సన్నగా మారిపోయాడు. కుంభమేళా లో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎంతలా ట్రోల్ అయ్యాయో మనమంతా చూసాము. ముఖ్యంగా ఆయన పొట్టని చూసి అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు వర్కౌట్స్ తో పవన్ కళ్యాణ్ ఆ పొట్టని కరిగించినట్టు తెలుస్తుంది. ఒకపక్క ఆయన సినిమా షూటింగ్ కి సిద్ధం అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తుంటే, మరోపక్క మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవంతం చేసింది.
నేటి నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేసారు. ముందుగా ఈ సినిమాలో పని చేసిన ఆర్టిస్ట్స్ తాలూకా డబ్బింగ్ ని పూర్తి చేస్తారు, పవన్ కళ్యాణ్ వచ్జే నెలలో డబ్బింగ్ చెప్పబోతున్నాడట. ఏప్రిల్ 15 లోపు గ్రాఫిక్స్ వర్క్ ని మొత్తం పూర్తి చేసి, ఏప్రిల్ 23 లోపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ముగించాలని, ఆ తర్వాత ప్రొమోషన్స్ చురుగ్గా చేయాలనీ ప్లానింగ్స్ చేసుకుంటున్నారట. తెలుగు ఈవెంట్స్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నాడట. తెలుగు ఈవెంట్స్ లో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు, మరి ఇతర రాష్ట్రాల్లో జరిపే ఈవెంట్స్ కి ఆయన వస్తాడో లేదో చూడాలి. ముంబై లో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారట, ఆ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ నుండి ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ లీక్..ఏ రేంజ్ ఉందంటే!