Homeటెలివిజన్‌Kirak Boys Khiladi Girls: నలుగురిలో విష్ణుప్రియ పరువు తీసిన శ్రీముఖి... ఆ పనులు ఇంకా...

Kirak Boys Khiladi Girls: నలుగురిలో విష్ణుప్రియ పరువు తీసిన శ్రీముఖి… ఆ పనులు ఇంకా మానలేదా అంటూ పచ్చి కామెంట్స్!

Kirak Boys Khiladi Girls: స్టార్ మా ఛానల్ లో ఏ కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేసినా యాంకర్ మాత్రం శ్రీముఖినే. అంతగా ఆమె హవా నడుస్తోంది. స్టార్ మా ఆదివారం పరివారం, సూపర్ సింగర్, నీతోనే డాన్స్ ఇలా ప్రతి షోలో శ్రీముఖి సందడి చేస్తుంది. శ్రీముఖి స్టార్ మా ఆస్థాన యాంకర్ అయిపోయింది. రీసెంట్ గా ‘ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ‘ అంటూ సరికొత్త షో ప్రారంభించారు. ఇందులో అనసూయ భరద్వాజ్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి హోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో అందరి మీద తనదైన పంచులు వేస్తూ శ్రీముఖి ఎంటర్టైన్ చేస్తుంది.

తాజా ఎపిసోడ్ లో విష్ణుప్రియ పై సెటైర్లు వేసింది. అందరి ముందు విష్ణు పరువు తీసేసింది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయిలతో కలిసి వచ్చిన విష్ణు స్టేజి పైన డాన్స్ చేసింది. విష్ణు గెటప్ చూసి శ్రీముఖి పంచులు వేసింది. ఏంటమ్మాయ్ నువ్వు ఇంకా ఆ రికార్డింగ్ డాన్సులు వేయడం మానుకోలేదా అంటూ ఇజ్జత్ తీసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా పడి పడి నవ్వారు.

ఆ మాటకు ఏం చెప్పాలో తెలియక విష్ణు ప్రియ బిత్తర చూపులు చూసింది. ఇదిలా ఉంటే .. కిలాడీ లేడీస్ కి లీడర్ గా వ్యవహరిస్తున్న అనసూయ చేస్తున్న అతి మామూలుగా లేదు. గేమ్ షో పేరుతో అనసూయ చేస్తున్న రచ్చకి నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా లాంచింగ్ ఎపిసోడ్ లో ఓ టాస్క్ కోసం అనసూయ తన కోట్ విప్పడం తెగ వైరల్ అయింది.

ఫ్యామిలీతో కలిసి చూసే షోలో ఈ పాడు గేమ్స్ ఏంటని మండి పడుతున్నారు. అయినా కూడా అనసూయ తగ్గేదే లే అంటుంది. ఇక లేటెస్ట్ ప్రోమో కూడా డబుల్ మీనింగ్ మాటలతో, బూతులతో నిండిపోయింది. కాగా ఈ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షో ప్రతి శని, ఆదివారాల్లో స్టార్ మాలో ప్రసారం అవుతుంది. అనసూయ దాదాపు రెండేళ్ల తర్వాత బుల్లితెరపై కనిపిస్తుంది. రీఎంట్రీలో హాట్ లుక్స్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది.

Kiraak Boys Khiladi Girls - Full Promo | Village Theme | Every Sat -Sun @ 9 PM | Star Maa

Exit mobile version