Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా లావణ్య తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఆరోపించడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఆమె సమర్పించిన నేపథ్యంలో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రాజ్ తరుణ్ మీద ఇటీవల లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ నాతో 11 ఏళ్ళు సహజీవనం చేశాడు. నన్ను శారీరకంగా వాడుకున్నాడు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం నా ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య ఆరోపణలు చేసింది.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసింది. పోలీసులు లావణ్యకు తగు ఆధారాలు సమర్పించాలని నోటీసులు పంపారు. ఈ క్రమంలో లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినట్లు తెలుస్తుంది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడు అనేది కొత్తగా ఆమె చేస్తున్న ఆరోపణ. అన్విక పేరుతో నేను, రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నాము. అదే పేరుతో విదేశాలకు వెళ్ళామని లావణ్య అంటున్నారు.
తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్లు లావణ్య మెడికల్ రిపోర్ట్స్ పోలీసులకు అందించారని సమాచారం. అలాగే మరికొన్ని ఆధారాలు, 70 ఫోటోలు కూడా తాజా కంప్లైంట్ తో పాటు ఆమె పోలీసులకు సమర్పించారట. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా లావణ్య మీద కేసు పెట్టింది.
తిరబడరసామీ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా రిలేషన్ లో ఉన్నారని లావణ్య ఆరోపిస్తుంది. ఇక లావణ్య అలిగేషన్స్ ని రాజ్ తరుణ్ ఖండిస్తున్నారు. లావణ్యతో నేను రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే. మేము విడిపోయి చాలా కాలం అవుతుంది. మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది. నన్ను లావణ్య టార్చర్ పెట్టిందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నారు.