Kanguva: కంగువ సినిమాకి కూడా సీక్వెల్ ఉందా..? ప్రతి సినిమాకీ సీక్వెల్ తీయడం అవసరమా..?

ఇప్పుడు ఏ ఒక పెద్ద సినిమా వచ్చినా కూడా దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలోనే మేకర్స్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాకి సెకండ్ పార్ట్ ఉండబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సెకండ్ పార్ట్ నిజంగానే తీస్తారా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఆ సినిమాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ నెక్స్ట్ పార్ట్ లో ఉండబోతుందని చెప్పడానికే ఇలాంటి ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరికొన్ని సినిమాలైతే ఎలా ముగించాలో తెలియక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి సెకండ్ పార్ట్ కింద అనౌన్స్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : July 10, 2024 2:37 pm

Kanguva

Follow us on

Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య…ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను దసరకి రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద ఇప్పటికే పాన్ ఇండియాలో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సూర్య సరికొత్త గెటప్ లో కనిపిస్తుండడం విశేషం.

అలాగే ఇందులో సూర్య డ్యూయల్ రోల్ పోషించడం కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించడం మరొక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి కూడా సెకండ్ పార్ట్ ఉండబోతుందంటూ వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఏ ఒక పెద్ద సినిమా వచ్చినా కూడా దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలోనే మేకర్స్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాకి సెకండ్ పార్ట్ ఉండబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సెకండ్ పార్ట్ నిజంగానే తీస్తారా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఆ సినిమాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ నెక్స్ట్ పార్ట్ లో ఉండబోతుందని చెప్పడానికే ఇలాంటి ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరికొన్ని సినిమాలైతే ఎలా ముగించాలో తెలియక ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసి సెకండ్ పార్ట్ కింద అనౌన్స్ చేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఫస్ట్ పార్ట్ గట్టేక్కితే సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేయాలా వద్ద అని డిసైడ్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ మొదటి పార్ట్ ఫ్లాప్ అయినట్టైతే సెకండ్ పార్ట్ జోలికి అసలు పోవట్లేదు…ఇలా మొత్తానికైతే ఏదో ఒకటి చేసి వాళ్ల సినిమాలను సక్సెస్ చేసుకోవాలని చేస్తున్నారు. ఇక వీటిలో కొందరి ప్లాన్స్ వర్కౌట్ అయితే మరి కొందరివి మాత్రం బెడిసికొడుతున్నాయి…