https://oktelugu.com/

Bank Charges : మే 1 నుంచి ఈ బ్యాంకుల ఛార్జీల్లో మార్పులు.. ఎలా ఉన్నాయంటే?

యస్ బ్యాంకు సైతం ఛార్జీల సవరణలు చేసింది. వివిధ సేవింగ్స్ ఖాతాల్లో సగటు నిల్వ పరిమితిని పెంచింది. అంతేకాకుండా రూ.1500 కంటే ఎక్కువ బిల్లుల మొత్తాన్ని ఈ బ్యాంకు ద్వారా చెల్లించాలనుకుంటే 1 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 1, 2024 / 12:19 PM IST

    bank charges hike from may 1 2024

    Follow us on

    Bank Charges :  మే నెల నుంచి ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే 2024 ఏడాది సందర్భంగా ఈసారి బ్యాంకు ఛార్జీల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన వార్షిక చార్జీలను పెంచారు. మిగతా వ్యవహారాల్లో కూడా కొన్ని అదనంగా ఛార్జీలను పెంచనున్నారు. కొన్ని బిల్లుల విషయంలోనూ సవరణలో చోటు చేసుకున్నాయి. దీంతో అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి వస్తోంది. మరి ఆ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?

    ప్రముఖ ఐసీఐసీఐ తో పాటు యస్ బ్యాంకులు వార్షిక ఛార్జీలను పెంచాయి. ఈ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారు సేవింగ్స్ అకౌంట్స్, చెక్ బుక్ జారీ, మనీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన ఛార్జీలను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన డెబిట్ కార్డు లావాదేవీలపై గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 వార్షిక రుసుమను చేశారు. పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.200 చేశారు. చెక్ బుక్, మనీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించిన కొన్ని అదనంగా ఛార్జీలను వేశారు.

    యస్ బ్యాంకు సైతం ఛార్జీల సవరణలు చేసింది. వివిధ సేవింగ్స్ ఖాతాల్లో సగటు నిల్వ పరిమితిని పెంచింది. అంతేకాకుండా రూ.1500 కంటే ఎక్కువ బిల్లుల మొత్తాన్ని ఈ బ్యాంకు ద్వారా చెల్లించాలనుకుంటే 1 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులపై కూడా కొన్ని ఛార్జీలను పెంచింది. వీటితో పాటు ఐడీఎఫ్ సీ బ్యాంకుకు చెందిన ఖాతాదారులు రూ.20 వేల కంేట ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లిస్తే జీఎస్టీ 18 శాతం జీఎస్టీతో పాటు 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

    మరో ప్రముఖ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఛార్జీల విషయం తెలుపకపోయినా డిపాజిట్ల విషయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఈ బ్యాంకులో ఎఫ్ డీ చేసి 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఆగిన వాళ్ల కోసం 0.75 వడ్డీ శాతాన్ని అదనంగా ఇవ్వనుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ ఎఫ్ డీలో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకుతో వ్యవహారాలు నడిపేవారు, బిల్లులు చెల్లించాలనుకునేవారు ఈ మార్పులను గమనించి వారికి అనుగుణంగా ట్రాన్జాక్షన్ నిర్వహించుకోవాలి.